News
News
X

హైకోర్టును ఆశ్రయించిన కానిస్టేబుల్ అభ్యర్థులు, కారణమిదే!

రాతపరీక్ష ప్రశ్నపత్రంలో 8 ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని నిపుణుల కమిటీకి పంపేలా పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించాలని కోరారు.

FOLLOW US: 
Share:

➥ ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు సరిగా లేవు

➥అభ్యంతరాలను నిపుణుల కమిటీకి పంపేలా ఆదేశించండి

➥హైకోర్టులో 80 మంది అభ్యర్థుల వ్యాజ్యం

ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నపత్రంలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలకు జవాబులు నిర్ణయించే అంశాన్ని నిపుణుల కమిటీకి పంపేలా పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించాలని కోరారు. జవాబులపై తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. గుంటూరు జిల్లాకు చెందిన జగం సహజ, మరో 79 మంది తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో మార్చి 3న విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో 6100  పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి మార్చి 13 నుంచి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీలో తాము నమోదుచేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ఫిజికల్ ఈవెంట్లలో తమకూ అవకాశం కల్పించాలని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ఏపీలో 6100  పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 30 నుంచి జనవరి 7 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. పరీక్షకు హాజరైన వారిలో 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు.

కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్!
ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన హాల్‌టికెట్లను(కాల్ లెటర్లు) రాష్ట్ర పోలీసు నియామక మండలి మార్చి 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 10 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కానిస్టేబుల్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పోస్టుల వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 6100

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- సివిల్ (మెన్/ఉమెన్): 3580 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం 100
విజయనగరం 134
విశాఖపట్నం (సిటీ) 187
విశాఖపట్నం (రూరల్) 159
తూర్పు గోదావరి 298
రాజమహేంద్రవరం (అర్బన్) 83
పశ్ఛిమ గోదావరి 204
కృష్ణా 150
విజయవాడ (సిటీ) 250
గుంటూరు (రూరల్) 300
గుంటూరు (అర్బన్) 80
ప్రకాశం 205
నెల్లూరు 160
కర్నూలు 285
వైఎస్సార్ - కడప  325
అనంతపురం 310
చిత్తూరు 240
తిరుపతి అర్బన్ 110
మొత్తం 3580

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 2520 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  630
రాజమహేంద్రవరం 630
మద్దిపాడు - ప్రకాశం  630
చిత్తూరు 630
మొత్తం 2520

శారీరక ప్రమాణాలు: (PMT)

➨ పురుష అభ్యర్థులు నిర్దేశిత పొడవు, ఛాతీ కలిగి ఉండాలి. మహిళా అభ్యర్థులైతే నిర్దేశిత పొడవు, బరువు కలిగి ఉండాలి.

🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా.. (PET)

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

కానిస్టేబుల్ పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

Published at : 03 Mar 2023 11:19 AM (IST) Tags: AP High Court Constable Candidates Constable Physical Events Constable Prelims Exam Answer Key

సంబంధిత కథనాలు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

SVNIT Jobs: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు

SVNIT Jobs: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు

CUK Jobs: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50 ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు

CUK Jobs: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50  ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్  పోస్టులు

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్