News
News
X

AP Police Constable PET PMT Schedule: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్!

అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 10 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

FOLLOW US: 
Share:

ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన హాల్‌టికెట్లను(కాల్ లెటర్లు) రాష్ట్ర పోలీసు నియామక మండలి మార్చి 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 10 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 13 నుంచి ఫిజికల్ ఈవెంట్లు (పీఎంటీ/ పీఈటీ) జరగనున్నాయి. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ చివరి వారంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఫిజికల్ ఈవెంట్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ఫిజికల్ ఈవెంట్లకు 95,208 మంది.. 
ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి మార్చి 13 నుంచి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు.

ఏపీలో 6100  పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 30 నుంచి జనవరి 7 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. పరీక్షకు హాజరైన వారిలో 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు.

పోస్టుల వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 6100

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- సివిల్ (మెన్/ఉమెన్): 3580 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం 100
విజయనగరం 134
విశాఖపట్నం (సిటీ) 187
విశాఖపట్నం (రూరల్) 159
తూర్పు గోదావరి 298
రాజమహేంద్రవరం (అర్బన్) 83
పశ్ఛిమ గోదావరి 204
కృష్ణా 150
విజయవాడ (సిటీ) 250
గుంటూరు (రూరల్) 300
గుంటూరు (అర్బన్) 80
ప్రకాశం 205
నెల్లూరు 160
కర్నూలు 285
వైఎస్సార్ - కడప  325
అనంతపురం 310
చిత్తూరు 240
తిరుపతి అర్బన్ 110
మొత్తం 3580

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 2520 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  630
రాజమహేంద్రవరం 630
మద్దిపాడు - ప్రకాశం  630
చిత్తూరు 630
మొత్తం 2520

శారీరక ప్రమాణాలు: (PMT)

➨ పురుష అభ్యర్థులు నిర్దేశిత పొడవు, ఛాతీ కలిగి ఉండాలి. మహిళా అభ్యర్థులైతే నిర్దేశిత పొడవు, బరువు కలిగి ఉండాలి.

🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా.. (PET)

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

కానిస్టేబుల్ పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

Published at : 01 Mar 2023 07:38 PM (IST) Tags: TS SI PMT TS Constable PET PMT APSLPRB APSLPRB Constable Physical Events APSLPRB Physical Events Call Letters AP Police Constable PET Hall Tickets AP Police Physical Events Admit Cards

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి