SCCL Results: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదల
సింగరేణి వెబ్‌సైట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఉంచినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహించిన వారంల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు సింగరేణి డైరెక్టర్ తెలిపారు.
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ సెప్టెంబరు 10న సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచారు. పరీక్ష నిర్వహించిన వారంల్లోనే ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ఫలితాల్లో మొత్తం 49,328 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆన్సర్ కీ ప్రకారం మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లోనే ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా విడుదల చేయనున్నారు అధికారులు తెలిపారు.
ఫలితాల కోసం డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి..
ఫలితాల కోసం వెబ్‌సైట్ క్లిక్ చేయండి..
సెప్టెంబరు 4న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. 117 పోస్టులకు 99,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 77,907 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 64 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా కరీంనగర్ జిల్లాలో పరీక్ష కేంద్రాలను సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ పరిశీలించారు. మొత్తం 8 జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలను 200 మందికి పైగా సింగరేణి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.8 జిల్లాల్లోని 187 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ ‘కీ’ని విడుదల చేసి ఆన్సర్ కీపై సెప్టెంబరు 7న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు.
నెగెటివ్ మార్కులు సైతం..
జూనియర్ అసిస్టెంట్ పరీక్షలకు భారీగా ధరఖాస్తులు రావడంతో సింగరేణి యాజమాన్యం ఈ సారి నెగెటివ్ మార్కుల నిబంధన రూపొందించింది. మరోవైపు 120 మార్కులకు ఉండే ఈ పరీక్షలకు కేవలం రెండు గంటల సమయంతోపాటు నెగెటివ్ మార్కులను ఏర్పాటు చేయడం గమనార్హం. తప్పు సమాధానం ఇస్తే మార్కులు తగ్గుతాయి.
పరీక్షల కోసం గట్టి నిఘా..
2015లో సింగరేణి సంస్ధ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్ మెంట్‌లో అవతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ పరీక్షల సందర్భంగా మాల్ ప్రాక్టీస్ చేస్తూ కొంత మంది దొరక్కడంతో ఈ దపా ఎలాంటి అవతవకలు జరగకుండా ఉండేందుకు సింగరేణి యాజమాన్యం గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం పరీక్షల నిర్వహణపై దళారుల మాటలు నమ్మవద్దని ప్రచారం చేయగా మరోవైపు పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నారు. వరుసగా రెండు సార్లు జరిగిన రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఇప్పుడు అలాంటివి జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా 177 పోస్టుల కోసం ఏకంగా లక్షల మందికిపైగానే ధరఖాస్తు చేసుకోవడం.. 98,880 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరవుతుండటంతో ఈ సారి సింగరేణి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఆరోపణలు రాకుండా పరీక్షలు నిర్వహించింది.
Also Read:
IFGTB Recruitment: ఐఎఫ్‌జీటీబీలో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు,అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కు చెందిన కోయంబత్తూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్(ఐఎఫ్‌జీటీబీ) తాత్కలిక ప్రాతిపదికన వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగ విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
FCI Recruitment 2022: ఎఫ్‌సీఐలో 5 వేలకుపైగా ఉద్యోగాలు!
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ III, ఇతరుల దరఖాస్తుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అయితే ఎఫ్సీఐ 2022 రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం వివరాలు మరియు దరఖాస్తు రుసుము వంటి అన్ని వివరాల గురించి తెలుసుకోండి.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..