అన్వేషించండి

Singareni Jobs: ప్రశాంతంగా ముగిసిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష, 89 శాతం అభ్యర్థులు హాజరు!

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 77,907 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది 79 శాతంగా నమోదైంది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం అభ్యర్థులు హాజరయ్యారు.

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 187 కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12 గంటలకు ముగిసింది. కాగా 177 సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 77,907 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది 79 శాతంగా నమోదైంది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 64 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా కరీంనగర్ జిల్లాలో పరీక్ష కేంద్రాలను సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ పరిశీలించారు. హైదరాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రాలను సంస్థ జీఎం కే సూర్యనారాయణ పర్యవేక్షించారు. మొత్తం 8 జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలను 200 మందికి పైగా సింగరేణి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

187 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..
సింగరేణి రాత పరీక్ష కోసం యాజమాన్యం 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో రెండు రీజియన్లు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొత్తగూడెం సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్‌లోనే 39 సెంటర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. కొత్తగూడెంలో 35 సెంటర్లు, మంచిర్యాలలో 28, ఖమ్మంలో 23, హైదరాబాద్‌ –1లో 19, హైదరాబాద్‌ –2లో 14, వరంగల్‌లో 18, ఆదిలాబాద్‌లో 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కొ రీజియన్‌కు పరీక్షల నిర్వహణ కోసం చీఫ్‌ కో–ఆర్డినేటర్లను నియమించారు. 

నెగెటివ్‌ మార్కులు సైతం..
జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలకు భారీగా ధరఖాస్తులు రావడంతో సింగరేణి యాజమాన్యం ఈ సారి నెగెటివ్‌ మార్కుల నిబంధన రూపొందించింది. మరోవైపు 120 మార్కులకు ఉండే ఈ పరీక్షలకు కేవలం రెండు గంటల సమయంతోపాటు నెగెటివ్‌ మార్కులను ఏర్పాటు చేయడం గమనార్హం. తప్పు సమాధానం ఇస్తే మార్కులు తగ్గుతాయి. 

పరీక్షల కోసం గట్టి నిఘా..
2015లో సింగరేణి సంస్ధ నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల రిక్రూట్‌ మెంట్‌లో అవతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీరింగ్‌ పరీక్షల సందర్భంగా మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కొంత మంది దొరక్కడంతో ఈ దపా ఎలాంటి అవతవకలు జరగకుండా ఉండేందుకు సింగరేణి యాజమాన్యం గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం పరీక్షల నిర్వహణపై దళారుల మాటలు నమ్మవద్దని ప్రచారం చేయగా మరోవైపు పోలీస్‌ శాఖ సహకారం కూడా తీసుకున్నారు. వరుసగా రెండు సార్లు జరిగిన రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఇప్పుడు అలాంటివి జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా 177 పోస్టుల కోసం ఏకంగా లక్షల మందికిపైగానే ధరఖాస్తు చేసుకోవడం.. 98,880 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరవుతుండటంతో ఈ సారి సింగరేణి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఆరోపణలు రాకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Also Read:

IFGTB Recruitment: ఐఎఫ్‌జీటీబీలో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు,అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కు చెందిన కోయంబత్తూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్(ఐఎఫ్‌జీటీబీ) తాత్కలిక ప్రాతిపదికన వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగ విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

FCI Recruitment 2022: ఎఫ్‌సీఐలో 5 వేలకుపైగా ఉద్యోగాలు!
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ III,  ఇతరుల దరఖాస్తుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అయితే ఎఫ్సీఐ 2022 రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం వివరాలు మరియు దరఖాస్తు రుసుము వంటి  అన్ని వివరాల గురించి తెలుసుకోండి.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget