అన్వేషించండి

Singareni Jobs: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 లోపు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం సూచించింది.

Singareni Recruitment Notification: సింగరేణిలో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. గతనెలలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఇటీవల అంతర్గత అభ్యర్థుల ద్వారా ఖాళీల భర్తీకి సింగరేణి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఇక తాజాగా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మరో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి పేపరు ప్రకటన మాత్రమే అధికారులు విడుదల చేశారు. అర్హతలు, పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఈఅండ్‌ఎం, సిస్టమ్స్)-49 పోస్టులు, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ-100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్, ఎలక్ట్రికల్)-33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో 47 పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీలో 98 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 4న సాయంత్రం 45 గంటల్లోపు  ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చని సింగరేణి యాజమాన్యం సూచించింది. 

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 327

* ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 49 పోస్టులు

➥ ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్ క్యాడర్): 42 పోస్టులు

➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్): 07 పోస్టులు

*నాన్- ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 278 పోస్టులు

➥ జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (గ్రేడ్-సి): 100 పోస్టులు

➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్): 09 పోస్టులు

➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 24 పోస్టులు

➥ ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1: 47 పోస్టులు

➥ ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ-1:  98 పోస్టులు

అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. 

వయోపరిమితి: అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి వర్తించదు.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.04.2024. (12 AM నుంచి)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.05.2024. (5 PM వరకు)

Website

Singareni Jobs: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
కొనసాగుతున్న 272 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ..
సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫిబ్రవరి 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మైనింగ్‌)-139 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ)-22 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌)-22 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ)-10 పోస్టులు, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌-10 పోస్టులు; మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో జియాలజిస్ట్‌)- పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌)-18 పోస్టులు, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌- 03 పోస్టులు, జనరల్‌ డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (జీడీఎంవోస్‌)-30 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీర్‌ ట్రైనీ (సివిల్‌) ఈఅండ్‌ఎస్‌ గ్రేడ్‌-సీలో 16 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మార్చి 1న ప్రారంభమైంది. మార్చి 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మార్చి 1 నుంచి అందుబాటులో ఉండనుంది.

272 ఉద్యోగాల అర్హతలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget