అన్వేషించండి

Singareni Junior Assistant Key: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ ఆన్సర్‌ కీ విడుదల, అభ్యంతరాలుంటే తెలపొచ్చు!

పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదుచేయాల్సి ఉంటుంది.

సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం సెప్టెంబ‌రు 4న‌ నిర్వహించిన రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 77,907 మంది పరీక్షకు హాజరయ్యారు. 8 జిల్లాల్లోని 187 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ ‘కీ’ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను సెప్టెంబరు 7న ఉదయం 11 గంటల్లోపు తెలపాల్సి ఉంటుంది.  

 

PWT Preliminary Key Singareni Junior Assistant Key: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ ఆన్సర్‌ కీ విడుదల, అభ్యంతరాలుంటే తెలపొచ్చు!

 

ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలపడానికి క్లిక్ చేయండి..



మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్


సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షను సెప్టెంబరు 4న రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 187 కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12 గంటలకు ముగిసింది. కాగా 177 సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 77,907 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది 79 శాతంగా నమోదైంది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 64 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా కరీంనగర్ జిల్లాలో పరీక్ష కేంద్రాలను సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ పరిశీలించారు. హైదరాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రాలను సంస్థ జీఎం కే సూర్యనారాయణ పర్యవేక్షించారు. మొత్తం 8 జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలను 200 మందికి పైగా సింగరేణి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

 

187 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..
సింగరేణి రాత పరీక్ష కోసం యాజమాన్యం 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో రెండు రీజియన్లు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొత్తగూడెం సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్‌లోనే 39 సెంటర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. కొత్తగూడెంలో 35 సెంటర్లు, మంచిర్యాలలో 28, ఖమ్మంలో 23, హైదరాబాద్‌ –1లో 19, హైదరాబాద్‌ –2లో 14, వరంగల్‌లో 18, ఆదిలాబాద్‌లో 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటల పాటు పరీక్ష నిర్వహించారు. ఒక్కొ రీజియన్‌కు పరీక్షల నిర్వహణ కోసం చీఫ్‌ కో–ఆర్డినేటర్లను నియమించారు. 

 

నెగెటివ్‌ మార్కులు సైతం..
జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలకు భారీగా ధరఖాస్తులు రావడంతో సింగరేణి యాజమాన్యం ఈ సారి నెగెటివ్‌ మార్కుల నిబంధన రూపొందించింది. మరోవైపు 120 మార్కులకు ఉండే ఈ పరీక్షలకు కేవలం రెండు గంటల సమయంతోపాటు నెగెటివ్‌ మార్కులను ఏర్పాటు చేయడం గమనార్హం. తప్పు సమాధానం ఇస్తే మార్కులు తగ్గుతాయి. 

 

పరీక్షల కోసం గట్టి నిఘా..
2015లో సింగరేణి సంస్ధ నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల రిక్రూట్‌ మెంట్‌లో అవతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీరింగ్‌ పరీక్షల సందర్భంగా మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కొంత మంది దొరక్కడంతో ఈ దపా ఎలాంటి అవతవకలు జరగకుండా ఉండేందుకు సింగరేణి యాజమాన్యం గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం పరీక్షల నిర్వహణపై దళారుల మాటలు నమ్మవద్దని ప్రచారం చేయగా మరోవైపు పోలీస్‌ శాఖ సహకారం కూడా తీసుకున్నారు. వరుసగా రెండు సార్లు జరిగిన రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఇప్పుడు అలాంటివి జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా 177 పోస్టుల కోసం ఏకంగా లక్షల మందికిపైగానే ధరఖాస్తు చేసుకోవడం.. 98,880 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరవుతుండటంతో ఈ సారి సింగరేణి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఆరోపణలు రాకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

 

Also Read:

TSPSC Recruitment: 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!
తెలంగాణ స్టేట్ ​పబ్లిక్ ​సర్వీస్​ కమిషన్ ​మరో భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

Also Read:

IFGTB Recruitment: ఐఎఫ్‌జీటీబీలో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు,అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కు చెందిన కోయంబత్తూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్(ఐఎఫ్‌జీటీబీ) తాత్కలిక ప్రాతిపదికన వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగ విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

Also Read:

FCI Recruitment 2022: నిరుద్యోగులకు శభవార్త, ఎఫ్‌సీఐలో 5 వేలకుపైగా ఉద్యోగాలు!
FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ III,  ఇతరుల దరఖాస్తుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అయితే ఎఫ్సీఐ 2022 రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం వివరాలు మరియు దరఖాస్తు రుసుము వంటి  అన్ని వివరాల గురించి తెలుసుకోండి.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లియండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget