అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SBI లో జూనియర్‌ అసోసియేట్(SBI Clerk) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష (Prelims) పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు.

State Bank of India Clerks Halltickets: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)లో జూనియర్‌ అసోసియేట్(SBI Clerk) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష (Prelims) పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. జనవరి 12 వరకు అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. నవంబరు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జనవరి 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు.. ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లర్క్‌ (జూనియర్‌ అసోసియేట్‌) పోస్టుల భర్తీకి నవంబరు 17న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8773 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 8283 రెగ్యులర్ పోస్టులుకాగా.. 490 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి నవంబరు 17 నుంచి డిసెంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

క్లర్క్స్ ప్రిలిమ్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం:

ప్రిలిమినరీ పరీక్ష: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి 2024, జనవరి 5, 6, 11, 12 తేదీల్లో  ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్రశ్నలు-30 మార్కులు (25 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటి-35 ప్రశ్నలు-35 మార్కులు (20 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు (20 నిమిషాలు) ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు (1 గంట)

మెయిన్ పరీక్ష: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి 2024, ఫిబ్రవరిలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ ఇంగ్లిష్-40 ప్రశ్నలు-40 మార్కులు(35 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు (45 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-60 మార్కులు (45 నిమిషాలు) ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

ఆంధ్రప్రదేశ్‌: అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్.

పే స్కేలు: Rs.17,900 - రూ.47,920.

బేసిక్‌పే: రూ.19,900. (రూ.17900తోపాటు రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఉంటాయి. 

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget