అన్వేషించండి

Saudi Arabia: సౌదీలో ఉద్యోగాలు కూడా ఇక కష్టమే - ఆ నాలుగు రంగాల్లో విదేశీలకు ఇక నో జాబ్స్ !

Saudi Jobs: సౌదీ అరేబియా ప్రభుత్వం నాలుగు కీలక వృత్తుల్లో విదేశీయులు పనిచేయకుండా నిషేధం విధించింది. ఇప్పటికే ఆయా ఉద్యోగాల్లో ఉన్న వారిని కూడా తొలగించనున్నారు.

Saudi Arabia tightens job rules: సౌదీ అరేబియా ప్రభుత్వం తన స్వదేశీకరణ  ప్రక్రియలో భాగంగా ప్రవాసులకు మరో భారీ షాక్ ఇచ్చింది. తాజాగా నాలుగు కీలక వృత్తుల్లో విదేశీయులు పనిచేయకుండా నిషేధం విధిస్తూ నిబంధనలను కఠినతరం చేసింది.  
 
నాలుగు కీలక వృత్తుల్లో విదేశీయులపై నిషేధం

సౌదీ మానవ వనరుల , సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. సేల్స్, పర్చేసింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ,  ఫైనాన్స్ వంటి రంగాల్లోని కొన్ని నిర్దిష్ట పోస్టులను కేవలం సౌదీ పౌరులకు మాత్రమే కేటాయించింది. దీనివల్ల ఆయా రంగాల్లో ఏళ్ల తరబడి స్థిరపడిన వేలాది మంది ప్రవాసులు, ముఖ్యంగా భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రైవేట్ రంగంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

స్థానిక యువతకు పెద్దపీట- విజన్ 2030'లో భాగమే                         

సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  విజన్ 2030 లో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యీకరించడంతో పాటు, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. గతంలో కేవలం చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితమైన ఈ స్వదేశీకరణ విధానం, ఇప్పుడు మేనేజ్‌మెంట్ ,  ఫైనాన్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు కూడా విస్తరింప చేస్తున్నారు. 

నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు                             

కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణీత శాతం కంటే ఎక్కువ మంది విదేశీయులను పైన పేర్కొన్న వృత్తుల్లో నియమించుకునే కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు పాటించని సంస్థలకు భారీ జరిమానాలతో పాటు, వారి వ్యాపార లైసెన్సులను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉన్న విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు ముగియగానే, వాటిని పునరుద్ధరించబోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రవాసులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

ప్రవాసులపై ప్రభావం -  భవిష్యత్తు                          

సౌదీలో సుమారు 25 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. తాజా నిర్ణయం వల్ల అకౌంటెంట్లు, సేల్స్ మేనేజర్లు , ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్న అనేక మంది భారతీయులపై నేరుగా ప్రభావం పడనుంది. గల్ఫ్ దేశాలలో మారుతున్న ఈ ఉపాధి సమీకరణాల వల్ల భారత్ లాంటి దేశాలకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం  కూడా తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరిన్ని రంగాలను కూడా ఈ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నందున, ప్రవాసులు ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. 

టాప్ హెడ్ లైన్స్

Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget