News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

న్యూఢిల్లీ సాహిత్య అకాడమిలో 09 ఉద్యోగాలు, దరఖాస్తుచేస్కోండి! అర్హతలివే!

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 09 పోస్టులను భర్తీ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10+2, ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌  ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 09

పోస్టుల వారీగా ఖాళీలు..

➥ డిప్యూటీ సెక్రటరీ(జనరల్): 01

➥ సీనియర్‌ అకౌంటెంట్‌: 01

➥ పబ్లికేషన్‌ అసిస్టెంట్‌: 01

➥ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌: 01

➥ స్టెనోగ్రాఫర్‌: 02

➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 03

అర్హత: పోస్టును అనుసరించి 10+2, ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 30-50 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షవిధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షను పార్ట్-1, పార్ట్-2 రెండు విధాలుగా నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పరీక్షల్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది.

పార్ట్-1 పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో  60 మార్కులకు  రాతపరీక్ష నిర్వహిస్తారు. జనరల్ సైన్స్/జనరల్ నాలెడ్జ్‌ నుంచి 40 ప్రశ్నలు, హిందీ గ్రామర్-5 మార్కులు, ఇంగ్లిష్ గ్రామర్-5 మార్కులు, కంప్యూటర్-5 మార్కులు,  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 5 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. 

పార్ట్-2 పరీక్ష: డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు 40 మార్కులు కేటాయించారు. ఇందులో ఎస్సీ (ఇంగ్లిష్/హిందీ), లెటర్ (ఇంగ్లిష్/హిందీ), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, నోటిస్/అడ్వర్‌టైజ్‌మెంట్ అంశాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్-40 %, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ-35 %గా నిర్ణయించారు. 

చిరునామా: 
Secretary, Sahitya Akademi, 
Rabindra Bhavan, 35 Ferozeshah Road, 
New Delhi-110001.

దరఖాస్తు చివరి తేది: 12.06.2023.

Notification

Website

Also Read:

సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!
పూణేలోని సీమెన్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్‌తోపాటు, అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు పూణేలోని కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

నాగ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా!
నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) రెగ్యులర్, డిప్యూటేషన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ(గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంఎస్‌, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తులను గూగుల్‌ ఫాం ద్వారా సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 03 Jun 2023 06:47 PM (IST) Tags: various posts Sahitya Akademi Sahitya Akademi Notification Sahitya Akademi Recruitment

ఇవి కూడా చూడండి

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

AIIMS: ఎయిమ్స్‌ పట్నాలో 20 ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS: ఎయిమ్స్‌ పట్నాలో 20 ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వివరాలు ఇలా

NIE: ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు

NIE: ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు

Railway Recruitment: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా

Railway Recruitment: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది