అన్వేషించండి

రైల్వేలో 1688 ఉద్యోగాలు.. RRB NTPC Jobs నోటిఫికేషన్- ముఖ్యమైన తేదీ, ఫీజు వివరాలు

RRB NTPC UG Recruitment | రైల్వేశాఖ 12వ తరగతి ఆర్హతతో నాన్-టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ (NTPC) అండర్‌గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 1,688 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CBT 1, CBT 2, టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక.

రైల్వేలోని వివిధ జోన్లలో నాన్-టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ (NTPC) అండర్‌గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 1,688 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు నవంబర్ 13 రాత్రి 11:59 గంటల వరకు ఫారంను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ NTPC అండర్‌గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్ 2026 షార్ట్ నోటిఫికేషన్‌ విడుదలకు ఏర్పాటు చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ జోన్లలో నాన్-టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ పరిధిలోని 1,688 అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభమై, నవంబర్ 13 రాత్రి 11:59 గంటలకు పూర్తవుతుంది. CEN 07/2026 కింద ఈ నియామకాలు జరగనున్నాయి. రైల్వే శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ 14న విడుదల చేయనుంది.

ఏ పోస్టులు భర్తీ చేస్తారు 

ఆర్ఆర్బీ ఎన్‌టిపిసి యుజి (RRB NTPC UG) కింద 4 రకాల పోస్టులు ఉన్నాయి. వీటిలో ట్రైన్ క్లర్క్ పోస్టులు 188 ఉండగా, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 700, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 200, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 600 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 1,688 ఖాళీలను భర్తీచేయనున్నారు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుకు ప్రారంభ వేతనం రూ.21,700 గా ఉండగా, ట్రైన్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్,  జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు ప్రారంభ జీతం రూ.19,900గా ఉంది. ఈ పోస్టులకు 7వ సెంట్రల్ పే కమిషన్ (7th CPC) ప్రకారం వేతనం, ఇతర అలవెన్స్ అందిస్తారు.

12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి 

అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (10+2) ఉత్తీర్ణులై ఉన్నవారు అర్హులు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్‌పై హిందీ లేదా ఇంగ్లీషులో టైపింగ్ అర్హత తప్పనిసరి చేశారు. జనవరి 1, 2027 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. 

అక్టోబర్ 15 నుంచి దరఖాస్తులు

అభ్యర్థులు ఆర్ఆర్బీ (RRB) అధికారిక దరఖాస్తు పోర్టల్ లేదా సంబంధిత ప్రాంతీయ RRB వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అక్టోబర్ 15 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాసైన వారికి ఇది మంచి అవకాశం. దరఖాస్తు కోసం ముందుగా New Registration చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి వ్యక్తిగత, విద్యా సంబంధిత, ఇతర వివరాలు నింపాలి. అప్లికేషన్ ఫారమ్‌లో ఫోటో, సంతకం, అవసరాన్ని బట్టి ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం నిర్ణీత ఫీజు చెల్లించి ఫారమ్‌ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫారమ్ సమర్పించిన తర్వాత దాని కాపీని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి. 

దరఖాస్తు ఫీజు వివరాలు

జనరల్, ఓబీసీ (OBC) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 కాగా, ఎస్సీ (SC), ఎస్టీ (ST), మాజీ సైనికోద్యోగులు, మహిళలు, దివ్యాంగులు (PwBD), ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) అభ్యర్థులకు కనీస ఫీజు 250 రూపాయలుగా నిర్ణయించారు. మొదటి దశ సిబిటి (CBT 1) పరీక్షకు హాజరయ్యే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు బ్యాంక్ ఛార్జీలు మినహాయించి 400 రీఫండ్ చేస్తారు. అలాగే ఫీజు రాయితీ ఉన్న కేటగిరీ అభ్యర్థులు CBT 1 కు హాజరైతే 250 రీఫండ్ చేస్తారు. 

ఎంపిక విధానం 

ఆర్ఆర్బీ ఎన్‌టిపిసి యుజి (RRB NTPC UG) నియామకాల్లో అభ్యర్థులు ముందుగా CBT 1 రాయాలి. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు CBT 2 ఉంటుంది. టైపింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి.

మొదట CBT 1 లో 100 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. CBT 2 లో 120 ప్రశ్నలు ఉండగా... ఇందులో జనరల్ అవేర్‌నెస్‌కు 50, మ్యాథమెటిక్స్‌ 35, రీజనింగ్‌ 35 ప్రశ్నలు ఉంటాయి. రెండు పరీక్షల్లోనూ Wrong Answer కు 1/3 వంతు నెగటివ్ మార్కులు (Negative Marking) ఉంటాయి.

Frequently Asked Questions

ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఎంపిక ప్రక్రియలో CBT 1, CBT 2 పరీక్షలు, టైపింగ్ స్కిల్ టెస్ట్ (అవసరమైన వారికి), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget