RRB NTPC Exam Suspended: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తాత్కాలికంగా రద్దు.. బోర్డు కీలక ప్రకటన
ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ లెవల్ 1 ఎగ్జామ్, ఫలితాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ బోర్డు ప్రకటన చేసింది. దీంతో ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టు కొన్ని రోజులపాటు వాయిదా పడింది.
RRB NTPC Level 1 Exams Suspended: అల్లర్ల కారణంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ లెవల్ 1 ఎగ్జామ్స్ ఫలితాలను తాత్కాలికంగా రద్దు చేశారు. బుధవారం ఉదయం కొందరు అల్లరిమూక బిహార్‌లోని అలీగఢ్‌లో ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పుపెట్టడం వివాదాస్పదంగా మారింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫేజ్ 2 కోసం ఫేజ్ 1 ఫలితాలపై అభ్యర్థులు తమ ఫిర్యాదును రిజిస్టర్ చేయడానికి rrbcommittee@railnet.gov.in మెయిల్ ఐడీకి వివరాలు పంపాలని బోర్డు సూచించింది.
మంగళవారం సైతం కొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా అల్లర్లు చెలరేగాయి. నాన్ టెక్నికల్ కేటగిరీల అభ్యర్థులు దాడులకు పాల్పడుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఫస్ట్ ఫేజ్‌లో మోసానికి పాల్పడి రెండో ఫేజ్‌కు అర్హత సాధించిన వారిని పరీక్షలకు అనుమతించేది లేదని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన ఫస్ట్ ఫేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫలితాలపై కొందరు అభ్యర్థుల్లో ఉన్న సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు నిపుణుల కమిటీ పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ లెవల్ 1 ఎగ్జామ్, ఫలితాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ బోర్డు ప్రకటన చేసింది. దీంతో ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టు కొన్ని రోజులపాటు వాయిదా పడింది.
Railway constitutes High Power Committee to look into Concerns of Candidates over NTPC CBT-1 Result.
— Ministry of Railways (@RailMinIndia) January 26, 2022
Candidates may submit their Grievances to Committee till 16th February, 2022https://t.co/6zNKijDA7q pic.twitter.com/7gAmAOUhFY
అభ్యర్థులు తమ సందేహాలను ఫిబ్రవరి 16, 2022 వరకు కమిటీకి పంపేందుకు అవకాశం కల్పించారు. ఇవి పరీశీలించిన కమిటీ మార్చి 4 లోగా తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి జరగాల్సిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిబ్రవరి 23 నుంచి జరగాల్సిన కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ 1 వాయిదా వేస్తున్నట్టు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. వాస్తవానికి 35,281 ఎన్‌టీపీసీ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2019లో నోటిఫికేషన్ విడుదల చేయగా పరీక్ష పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఫలితాలు ప్రకటించింది. ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 7 లక్షల మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఆర్ఆర్‌బీ (CEN) 01/2019 నోటిఫికేషన్‌లో పేరా 13 లో పేర్కొనట్లుగానే అభ్యర్థులను రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం ఎంపిక చేశామని బోర్డు వివరణ ఇచ్చింది. కానీ ఫలితాలుపై నమ్మకం లేదని కొందరు అభ్యర్థులు అల్లర్లకు దిగడంతో భారతీయ రైల్వే బోర్డు పేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులను తాత్కాలికంగా వాయిదా వేసింది.
Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..
Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..