RRB NTPC Answer Key 2025 విడుదల! మీ స్కోర్ చెక్ చేసుకోండి, అభ్యంతరాలుంటే ఇలా తెలపండి!
RRB NTPC Answer Key 2025 :గ్రాడ్యుయేట్ స్థాయి నాన్ టెక్నికల్ ఉద్యోగాల కోసం ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నిర్వహించిన పరీక్ష ఆన్సర్ కీ విడుదలైంది. వీటిపై అభ్యంతరాలు ఉంటే జులై ఆరు వరకు చెప్పవచ్చు.

RRB NTPC Answer Key 2025 :గ్రాడ్యుయేట్ స్థాయి నాన్ టెక్నికల్ ఉద్యోగాల కోసం RRB NTPC ఈ మధ్య తొలి దశ పరీక్ష నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని RRB NTPC విడుదల చేసింది.అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలు పొందుపరిచారు. ప్రాంతీయ RRB వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి మీరు రాసిన పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు.
RRB NTPC Answer Key 2025 ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెన్పాన్స్ వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టారు. అంటే పరీక్షలో ఇచ్చిన ఆయా ప్రశ్నలకు అభ్యర్థులు ఇచ్చిన సమాధానాల వివరాలను కూడా వెబ్‌సైట్లో ఉంచారు. మీరు లాగిన్ అయ్యి ఆ రెస్పాన్స్‌లను తెలుసుకోవచ్చు.
ప్రాథమిక కీ చూసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా ఆర్‌ఆర్‌బీకి తెలియజేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమాధానాలపై మీ అభ్యంతరాన్ని చెప్పవచ్చు. దీనికి యాభైరూపాయలు, బ్యాంకు సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు చెప్పిన అభ్యంతరం నిజమని తేలి ప్రాథమిక ఆన్సర్ కీలో తప్పు ఉన్నట్టు అయితే మీరు చెల్లించిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు. ఈ అభ్యంతరాలను జులై ఆరు అర్థరాత్రి లోపు చెప్పాల్సి ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అన్సర్ కీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
అభ్యర్థులు తమ ఆన్సర్ కీ చూసుకునేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి
1. మీ ప్రాంతానికి చెందిన ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2. హోమ్‌పేజ్‌లో RRB NTPC ఆన్సర్ కీ ఉంటుంది క్లిక్ చేయాలి.
3. లాగిన్ వివరాలు అడుగుతుంది. మీ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి.
4. తర్వాత స్క్రీన్‌పై వచ్చిన ఆన్సర్ కీని చెక్ చేయండి.
5. దీన్ని కూడా డౌన్‌లోడ్ చేసి మీ వద్ద ఉంచుకొండి. ఫ్యూచర్ రిఫరెన్స్‌కు అవసరం అవుతుంది.
RRB NTPC Graduate Level CBT 1 పరీక్ష ఎప్పుడు జరిగింది?
8,113 ఉద్యోగాల కోసం RRB NTPC Graduate Level CBT 1 పరీక్ష 2025 జూన్ 5 నుంచి జూన్ 24 వరకు నిర్వహించారు. మొత్తం 16 రోజుల పాటు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 11,558 ఖాళీలు ఉండగా డిగ్రీ అర్హతతో ఉన్న 8,113 పోస్టులకు పరీక్ష నిర్వహించారు. మిగతావి ఇంటర్ అర్హతతో భర్తీ చేయనున్నారు. గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీప్ కమర్శియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలను డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్నారు. డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు18 ఏళ్ల నుంచి 36 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లు వీటికి అప్లై చేసుకోవచ్చు.





















