By: ABP Desam | Updated at : 04 Dec 2022 03:36 PM (IST)
Edited By: omeprakash
ఏపీ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు
వైద్యశాఖ పటిష్టతలో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టిసారించింది. వైద్యారోగ్య శాఖలో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నోటిఫికేషన్ వెలువడింది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులనున భర్తీ చేయనున్నారు. డిసెంబరు 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 12లోగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 09
1) సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్: 06 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ (మెడికల్ మైక్రోబయాలజీ/అప్లయిడ్ మైక్రోబయాలజీ/ జనరల్ మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ) (లేదా) బీఎస్సీ(మెడికల్ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/లైఫ్ సైన్సెస్).
అనుభవం: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలో టీబీ బ్యాక్టిరియాలజీలో పీజీ అభ్యర్థులైతే 3 సంవత్సరాలు, డిగ్రీ అభ్యర్థులైతే 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
2) ల్యాబ్ టెక్నీషియన్: 03 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు డిప్లొమా (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ)/సర్టిఫికేట్ కోర్సు (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) బీఎస్సీ (ఎంఎల్‌టీ)తోపాటు ఏపీ పారామెడికల్ బోర్డులో సభ్యత్వం ఉండాలి.
అనుభవం: NTEP లేదా స్పూటమ్ మైక్రోస్కోపీలో ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 03.12.2022 |
దరఖాస్తుల సమర్పణకు చివరితేది | 12.12.2022 |
ప్రాథమిక ఎంపిక జాబితా | 14.12.2022 |
ప్రాథమిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణ | 15.12.2022 |
ప్రాథమిక జాబితా ఫైనల్ మెరిట్ లిస్ట్ వెల్లడి | 16.12.2022 |
ఎంపిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణ | 19.12.2022 |
తుది ఎంపిక జాబితా | 20.12.2022 |
Also Read:
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 482 ఉద్యోగాలు, అర్హతలివే!
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారిశుద్ధ్య విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 482 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీపీఎల్ కార్డు, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. పారిశుద్ధ్య నిర్వహణలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. సరైన అర్హతలుగల అభ్యర్థులు డిసెంబరు 9లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, మెరిట్ & రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
KVS Recruitment Exams: రేపటి నుంచి కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష, హాల్టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
LIC ADO Recruitment: 9394 ఉద్యోగాల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు, వెంటనే అప్లయ్ చేయండి! మారిన పరీక్ష తేదీ!
SSC Exams: సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!
Anganwadi Recruitment 2023: విజయనగరం జిల్లాలో 60 అంగన్వాడి పోస్టులు, వివరాలు ఇలా!
PWC India: గుడ్న్యూస్ చెప్పిన PWC - 30వేల ఉద్యోగాలు ఇస్తారట!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్లో ఐదుగురు!