By: ABP Desam | Updated at : 04 Dec 2022 02:10 PM (IST)
Edited By: omeprakash
జీవీఎంసీ ఉద్యోగాలు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారిశుద్ధ్య విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 482 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీపీఎల్ కార్డు, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. పారిశుద్ధ్య నిర్వహణలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. సరైన అర్హతలుగల అభ్యర్థులు డిసెంబరు 9లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాలి. గడువు తర్వాత దరఖాస్తులు స్వీకరించరు.
వివరాలు..
* పారిశుద్ధ్య కార్మికులు
మొత్తం ఖాళీలు: 482
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి. దరఖాస్తులతో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, బీపీఎల్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను జత పరచవలేను.
ఎంపిక విధానం: రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. పారిశుద్ధ్య నిర్వహణలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 09.12.2022.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Tenneti Viswanadham Bhavan,
Room No. 216, Sanitary Department,
Greater Visakhapatnam Municipal Corporation,
Visakhapatnam, Andhra Pradesh.
Notification & Application
Website
Also Read:
స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ
ఏపీలో ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్యారోగ్యశాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 957 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టూ.. ఖాళీగా ఉండకూడదన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలపరిమితికి గాను కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, మెరిట్ & రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
AP Constable Results: ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
Agniveer Recruitment Process: 'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Telangana Jobs: కొత్త వైద్య కళాశాలలకు 313 పోస్టుల మంజూరు, ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ!
BSF Recruitment: బీఎస్ఎఫ్లో వెటర్నరీ స్టాఫ్ పోస్టులు, వివరాలు ఇలా!
Viveka Murder Case : నిజాలు బయటపడే రోజు దగ్గర్లోనే, సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో విచారణ పూర్తి - దస్తగిరి
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?
YS Sharmila: తెలంగాణలో ఆత్మహత్యలే లేవు అన్న సన్నాసి ఎవరు? - వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!