అన్వేషించండి

APHC Recruitment: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 'క్లర్క్' ఉద్యోగాలు, ఈ అర్హతలు తప్పనిసరి

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. లా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆగస్టు 6 వరకు అవకాశం కల్పించారు.

Recruitment of Law Clerks in High Court of Andhra Pradesh: అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా ఒప్పంద ప్రాతిపదికన 12 లా క్లర్క్ ఖాళీలను భర్తీచేయనున్నారు. న్యాయశాస్త్రంలో మూడేళ్లు లేదా ఐదేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. అయితే బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా సభ్యత్వం ఉండకూడదు. అభ్యర్థులు ఆగస్టు 6లోగా ఆఫ్‌లైన్‌ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. కమిటీ నామినేట్ చేసిన అభ్యర్థులను ప్రధాన న్యాయమూర్తి అంగీకారంతో ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు వారి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న వ్యవధిలోపు వారి లా క్లర్క్‌లో చేరాలి. లా క్లర్క్‌గా అసైన్‌మెంట్‌లో చేరడానికి సమయం పొడిగింపు కోసం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి యొక్క స్వంత విచక్షణపై స్వీకరించవచ్చు.

ఉద్యోగాలకు ఎంపికైనవారు ఉద్యోగ సమయంలో ఎలాంటి రెగ్యులర్ కోర్సులు చదవకూడదు. అలాగే ఉద్యోగం చేస్తూ.. వేరే వృత్తిలో కొనసాగకూడదు. ఉద్యోగాలకు ఎంపికైనవారు కాంట్రాక్ట్ ప్రకారం ఏడాదిపాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే అవసరానికి అనుగుణంగా కాంట్రాక్ట్ వ్యవధిని పొడగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి అంగీకారంతో గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ గడువు కంటే ముందుగానే విధుల నుంచి వైదొలిగే వారికి కోర్టు ఉపేక్షించదు. వారిని అనర్హత కింద పరిగణిస్తుంది.   

విధులకు హాజరయ్యేవారు తమ కేటాయించిన కోర్టుకు సంబంధించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అడ్మిన్) గదిలో ఉంచిన రిజిస్టర్‌లో అటెండెన్స్ కింద ప్రతిరోజూ సంతకం చేయాల్సి ఉంటుంది. కోర్టు సెలవులు మినహాయించి.. అభ్యర్థులకు నెలకు ఒక సాధారణ సెలవు మాత్రమే ఉంటుంది. ఏడాదికి 12 సాధారణ సెలవులు మాత్రమే ఉంటాయి. అంతకు మించి సెలవులు తీసుకుంటే.. ఆ మొత్తాన్ని వారికిచ్చే జీతం నుంచి కోత విధిస్తారు.

వివరాలు..

* లా క్లర్క్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 12.  

కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది. అవసరానికి అనుగుణంగా కాంట్రాక్ట్ వ్యవధిని గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.

అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా తమ పేరు నమోదు చేసుకుని ఉండకూడదు.

వయోపరిమితి: 01.01.2024 లేదా 01.07.2024 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో. దరఖాస్తులు పంపే కవరు మీద 'Application for the Post of Law Clerks' అని రాయాలి.

ఎంపిక విధానం: విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

జీతం: నెలకు రూ.35,000. ఇతర ఎలాంటి అలవెన్సులు ఉండవు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar (Recruitment),
High Court of A.P. at Amaravathi, 
Nelapadu, Guntur District, 
Andhra Pradesh -522239.

దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 06.08.2024. (5 PM.)

Notification & Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
Embed widget