GHMC Jobs: జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్: మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన త్వరలోనే వెలువడనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరునాటికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన త్వరలోనే వెలువడనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరునాటికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. త్వరలోనే మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని మంత్రి అసెంబ్లీలో తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయనున్నామని వెల్లడించారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
ఇప్పటివరకు బస్తీ దవాఖానల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారని వెల్లడించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. పేదల సౌకర్యం కోసం బస్తీ దవాఖానల పని దినాల్లో మార్పు చేస్తామన్నారు. ఇకపై శనివారం సెలవు ఇస్తున్నామని, ఆదివారం పనిచేయనున్నాయని తెలిపారు.
బస్తీ దవాఖానల్లో ఉచితంగా లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి 134 రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానలతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లపై ఓపీ భారం తగ్గిందని చెప్పారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూటిషన్ కిట్లు పంపిణీ చేస్తామన్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ! - మంత్రి సబితా
తెలంగాణలో మరో ఉద్యోగాల జాతరకు త్వరలోనే సైరన్ మోగనుంది. రాష్ట్రంలో త్వరలోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటించారు. మన ఊరు-మన బడి మొదటిదశ కింద మరమ్మతులు చేపట్టిన 9,123 పాఠశాలలు జూన్ నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా పాఠశాలలు మూసివేయడం లేదన్నారు. భాషా పండితులు, ఇతర సమస్యలు కొన్ని కోర్టుల్లో ఉండటంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని పేర్కొన్నారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి ప్రస్తుత బదిలీల్లో పాత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అవకాశాలు ఉన్నాయన్నారు. మహబూబాబాద్, కొత్తగూడెంలలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు, ఆంగ్ల మీడియం విద్యార్థులకు వేర్వేరుగా బోధించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యా వాలంటీర్ల వేతనాలు ట్రెజరీలో నిలిచిపోయి ఉన్నాయని పరిష్కరించాలని అడిగారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..