News
News
వీడియోలు ఆటలు
X

వరంగల్‌ నిట్‌లో రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌, 1400 మందికి ఉద్యోగాలు!

వరంగల్‌ నిట్‌లో రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ను సాధించామని, గతేడాదితో పోల్చితే అత్యధిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగిందని నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు తెలిపారు

FOLLOW US: 
Share:

వరంగల్‌ నిట్‌లో రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ను సాధించామని, గతేడాదితో పోల్చితే అత్యధిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగిందని నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు తెలిపారు. నిట్‌లోని అంబేద్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌లో అక్షయ పేరిట సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. కార్యక్రమానికి టెక్‌ మహీంద్రా వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్ ‌(సీటీవో) దుర్గాప్రసాద్‌ అల్లాడ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిట్‌లోని సెంటర్‌ ఫర్‌ కెరీర్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (సీసీపీడీ) ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన ప్లేస్‌మెంట్‌ సంవత్సరాన్ని ప్రకటించినందుకు గర్వంగా ఉందన్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో 1400 మందికి ఆఫర్లు అందుకున్నారన్నారు.

అదనంగా 450 మంది ఎక్కువ ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లు సైతం విద్యార్థులులు అందుకున్నారన్నారు. సీసీపీడీ బీటెక్‌ 82 శాతం ప్లేస్‌మెంట్‌ రేట్‌ను సాధించారని, ఏడాదికో విద్యార్థికి అత్యధికంగా రూ.88 లక్షల సీటీసీ (కాస్ట్‌ టు కంపెనీ) అందించారన్నారు. సగటు మధ్యస్థ సీటీసీ కూడా గతేడాది కంటే భారీ పెరుగుదల నమోదైందన్నారు. సగటు సీటీసీ రూ.17.29 లక్షలు, మధ్యస్థ సీటీసీ రూ.12.6 లక్షలతో ప్లేస్‌మెంట్స్‌ వచ్చాయన్నారు.

క్యాంపస్‌ను సందర్శించిన 270కిపైగా కంపెనీలు..
2022-23 విద్యా సంవత్సరంలో 270 కంటే ఎకువ కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించారని, వారిలో 40 శాతం మంది క్యాంపస్‌ను మొదటిసారి సందర్శించినట్లు రమణారావు తెలిపారు. 2021లో-186 కంపెనీలు, 2022లో-221, 2023లో 268 కంపెనీలు వచ్చాయని వివరించారు. ప్రఖ్యాత కంపెనీలు లాభదాయకమైన ప్యాకేజీలతో ఒకే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో 35మంది విద్యార్థులను నియమించుకున్నట్లు చెప్పారు. దాదాపు అన్ని రంగాలలో నియామకాల పెరుగుదల కనిపించిందన్నారు. ఐటీ అన్ని విభాగాల నుంచి వచ్చిన మొత్తం ఎఫ్‌టీఈ ఆఫర్లలో 54శాతం కలిగి ఉందన్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌ వంటి ఐటీ రంగాల్లో చాలా డిమాండ్‌ ఉన్నాయన్నారు. శిక్షణా కోర్సులు, సహకార కార్యక్రమాల ద్వారా సీసీపీడీ చొరవ అన్ని కార్యక్రమాల నుండి విద్యార్థులకు ఫలవంతమైందన్నారు. విద్యార్థుల ప్రాక్టికల్‌ డొమైన్‌ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌ దృష్టాంతం ఆధారంగా ఇంటర్వ్యూలకు వారిని సిద్ధం చేయడానికి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. అదనంగా, విభాగాలు, వెలుపలి సంస్థల సహకారంతో సీసీపీడీ కమ్యూనికేషన్‌ సిల్‌-బిల్డింగ్‌ వర్‌షాప్‌లు, పారిశ్రామిక సందర్శనలు, ఇంటర్న్‌షిప్‌ల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. వరంగల్‌ నిట్‌కి ఒక చారిత్రక ఘనత అని వివరించారు.

Also Read:

భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 4,374 ఉద్యోగాలు, అర్హతలివే!
ముంబయిలోని భారత అణు శక్తి విభాగం ఆధ్వర్యంలోని 'భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌' వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్‌ 24 నుంచి మే 22 లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న వెబ్‌నోట్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల చేశారు. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 132 ఆర్ట్ టీచర్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 22 వెలువడింది. దీనిద్వారా 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 16 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 6 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 72 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో  38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 27 Apr 2023 12:23 AM (IST) Tags: Warangal NIT NIT Warangal Campus Placements campus placements National Institute of Technology

సంబంధిత కథనాలు

PMBI: న్యూఢిల్లీ పీఎంబీఐలో 37 అసిస్టెంట్ మేనేజర్& సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

PMBI: న్యూఢిల్లీ పీఎంబీఐలో 37 అసిస్టెంట్ మేనేజర్& సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

IITM: పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!

IITM:  పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

టాప్ స్టోరీస్

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?