NIC Recruitment 2026: ఎన్ఐసీలో 376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు!
NIC Recruitment 2026: ఎన్ఐసీలో 376 సైంటిఫిక్, టెక్నిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి అప్లై చేసుకోవచ్చు.

NIC Recruitment 2026: నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) 376 సైంటిఫిక్, టెక్నికల్ అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2026 లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యాంశాలు
- మొత్తం పోస్టులు : 376
- పోస్టులు : సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్-ఎ
- వేతనం: లెవెల్ 6 (రూ. 35,400 - రూ. 1,12,400)
- దరఖాస్తు విధానం: recruitment.nic.in ద్వారా ఆల్‌లైన్‌లో
- ఎంపిక విధానం: GATE స్కోర్ (2024 / 2025 / 2026) ఆధారంగా.
- M.Sc,MS, MCA , B.E (CS, EC, DA), B.Tech పూర్తి చేసి GATE స్కోర్ కలిగి ఉండాలి.
వయస్సు
- జనరల్/EWS: గరిష్టంగా 30 సంవత్సరాలు
- ఓబీసీ : 33 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ : 35 సంవత్సరాలు
- PwBD: 40- 45 సంవత్సరాలు
Also read: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
జీతాలు
- లెవెల్ 6, 7th పేస్కేలు - రూ. 35,400 – రూ. 1,12,400 వరకు
- దేశంలోని ఎక్కడైనా లేదా విదేశాలలో NIC కార్యాలయాలలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
Also read: యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
ఎంపిక విధానం
ఈ నియామకానికి ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత GATE (2024/2025/2026) స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్త్ విడుదల చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి తుది రిజల్ట్స్ విడుదల చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
- సెప్టెంబర్ 1, 2026 (ఉదయం 10:00 గంటల నుండి) అప్లికేషన్లు ప్రారంభం
- సెప్టెంబర్ 30, 2026 (సాయంత్రం 05:30 గంటల వరకు) అప్లై చేసుకోవచ్చు.
Also Read: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















