News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఏఎఫ్‌ క్యాట్‌ - 02/2023 రాతపరీక్ష ఫలితాలు సెప్టెంబరు 27న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌ - 02/2023) రాత పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 27న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 25 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జులైలో కోర్సు ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు. 

AFCAT - 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 276 ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి ఏఎఫ్‌క్యాట్ 02/2023 నోటిఫికేషన్ జూన్ 1న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ- ఫ్లయింగ్/ టెక్నికల్/ వెపన్ సిస్టమ్/ అడ్మినిస్ట్రేషన్/ లాజిస్టిక్స్/ అకౌంట్స్/ ఎడ్యుకేషన్/ మెటియరాలజీ; ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ- ఫ్లయింగ్ (ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికేట్) విభాగాలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జూన్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. 

రాతపరీక్ష ఇలా..
మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ & మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

పోస్టుల వివరాలు..

* ఏఎఫ్‌క్యాట్ -  AFCAT -  02/2023 

ఖాళీల సంఖ్య: 276

1) ఫ్లయింగ్ బ్రాంచ్: 11 (మెన్-05, ఉమెన్-06)

2) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 151 (మెన్-136, ఉమెన్-15)

విభాగం: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.

3) గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 114 (మెన్-99, ఉమెన్-15)

విభాగం: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ. 

4) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

విభాగం: ఫ్లయింగ్ బ్రాంచ్.

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

ఎస్‌బీఐలో 2000 పీవో పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభమైంది. కాగా.. దరఖాస్తు గడువు సెప్టెంబరు  27తో ముగియాల్సి ఉండగా.. అక్టోబరు 3 వరకు పొడిగించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 27 Sep 2023 11:05 PM (IST) Tags: Indian Air Force Indian Air Force Recruitment Air Force Common Admission Test AFCAT 02/2023 Results AFCAT 2023 Exam Results

ఇవి కూడా చూడండి

Civil Services: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు ఎంపిక!

Civil Services: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 90 మంది తెలుగు అభ్యర్థులు ఎంపిక!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం