NCDIR: ఎన్‌సీడీఐఆర్‌లో 16 ఉద్యోగాలు- అర్హతలు ఇవే! దరఖాస్తుచేసుకోండి!
బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిసెర్చ్(ఎన్‌సీడీఐఆర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు.
బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిసెర్చ్(ఎన్‌సీడీఐఆర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 11 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 16
పోస్టుల వారీగా ఖాళీలు
1. కంప్యూటర్ ప్రోగ్రామర్: ఈడబ్ల్యూఎస్- 01
2. ప్రాజెక్ట్ సైంటిస్ట్- బీ(మెడికల్): ఈడబ్ల్యూఎస్- 01
3. రిసెర్చ్ అసోసియేట్-III: యూఆర్- 01
4. కంప్యూటర్ ప్రోగ్రామర్(గ్రేడ్ ఏ): ఎస్టీ-01
5. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్(మెడికల్ సోషల్ వర్కర్): యూఆర్-01
6. డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్ ఏ): యూఆర్-01
7. ప్రాజెక్ట్ సైంటిస్ట్- బీ(మెడికల్): ఓబీసీ- 02
8. ప్రాజెక్ట్ సైంటిస్ట్- సీ(మెడికల్): ఓబీసీ- 01
9. ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్: ఈడబ్ల్యూఎస్- 01
10. ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫిసర్: ఓబీసీ- 01
11. ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్: ఎస్టీ-01
12. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్(స్టిటిటిక్స్): ఎస్టీ-01
13. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్(స్టిటిటిక్స్): ఎస్సీ- 01
14. కంప్యూటర్ ప్రోగ్రామర్(గ్రేడ్ బీ): ఓబీసీ- 01
15. ప్రాజెక్ట్ సైంటిస్ట్- సీ(మెడికల్): యూఆర్-01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్/ ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ మాస్టర్స్‌డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 28-40 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/ పర్సనల్ డిస్కషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.72325 చెల్లిస్తారు.
దరఖాస్తు చివరి తేది: 11.04.2023.
Also Read:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..