అన్వేషించండి

Assembly Sessions 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

Telangana News: రాష్ట్రంలో అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు.

Minister Sridhar Babu Comments on Job Calendar 2024: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ వేదికగా గురువారం మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) జాబ్ క్యాలెండర్‌పై (Job Calendar) కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. తద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ' (Young India Skill University) బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా.. అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని అన్నారు. మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నిస్తూనే ఉంటారని.. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని మంత్రి పేర్కొన్నారు. 

స్కిల్ వర్శిటీ స్థాపన

నిరుద్యోగులు, యువతలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని.. రాష్ట్రంలో 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ' స్థాపనకు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో అన్ని కోర్సులూ 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి  ఉంటాయని.. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. 'స్కిల్ యూనివర్శిటీ యువతకు ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతం ఇస్తుంది. ఈ ఏడాది 2 వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తాం. స్కిల్ వర్శిటీ కోసం ముచ్చర్లలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం.' అని మంత్రి వివరించారు.

'మరో నూతన నగరం'

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 4 వేల ఎకరాల్లో నగరం రూపుదాలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడారు. రాజధానిలో మరో నూతన నగరం నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇలా 3 నగరాలున్నాయని.. ముచ్చర్ల నాలుగో నగరంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. అక్కడ ఆరోగ్య, క్రీడా హబ్స్‌తో పాటుగా.. మెట్రోతో అనుసంధానిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకూ పలు రంగాలపై నూతన విధానాలు రూపొందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఏర్పాటు చేసే నగరంలో వైద్య సేవల నుంచి ఉపాధి వరకూ అన్నీ లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు.

నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నిరసన

మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం బీఆర్ఎస్ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో బుధవారం మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓ వైపు ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడుతున్నా.. ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అటు, బుధవారం నాటి అంశంపై మాట్లాడేందుకు అవకాశం అడిగిన బీఆర్ఎస్ మహిళా నేతల విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు.

Also Read: Telangana Politcs : తెలంగాణలో రాజుకున్న రాజకీయం - మహిళా ఎమ్మెల్యేల ఏడుపులతో ఎవరికి లాభం ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget