News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎల్‌ఐసీలో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 23న నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఎల్‌ఐసీలో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 23న నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జోన్లవారీగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏడీవో ప్రధాన పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పీడీఎఫ్ రూపంలో మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉన్నాయి.  అంతకు ముందు మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎల్ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో 9394  అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భ‌ర్తీకి ఈ ఏడాది జనవరిలో జోన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. సెంట్రల్ జోన్, నార్తర్న్ జోన్, వెస్ట్రర్న్ జోన్, ఈస్ట్రర్న్ జోన్, సదరన్ జోన్, నార్త్ సెంట్రల్ జోన్, సౌత్ సెంట్రల్ జోన్, ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలో మొత్తం 9394 ఏడీవో పోస్టులను ఎల్ఐసీ భర్తీ చేయనుంది.

ADO ఫలితాల కోసం క్లిక్ చేయండి..

మెయిన్ పరీక్ష ఇలా..
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 160 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 160 ప్రశ్నలు అడిగారు. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ & న్యూమరికల్ ఎబిలిటీ నుంచి-50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి-35 ప్రశ్నలు-35 మార్కులు; ఇన్‌స్స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ నుంచి-60 ప్రశ్నలు-60 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడిగారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇక ఎల్‌ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు 160 మార్కులకు‌గాను 100 ప్రశ్నలకు పరీక్ష నిర్వహించారు. 

జీత భత్యాలు ఇలా..
 ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నెలకు రూ.35,650-రూ.90,205 వేతనం ఉంటుంది. దీనికి ఇతర భత్యాలు అదనం.

నోటిఫికేషన్, జోన్లవారీగా ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Also Read:

టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు. సివిల్ & స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్‌, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, మినరల్, మైనింగ్, బెనిఫికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెకాట్రోనిక్స్, జియోఇన్‌ఫర్మాటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1358 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్-92 పోస్టులు, పీజీటీ- 846 పోస్టులు, సీఆర్‌టీ-374 పోస్టులు, పీఈటీ-46 పోస్టులు ఉన్నాయి.  కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించి మే 29 నుంచి జూన్‌ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు తదితర వివరాలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ మే 29న వెల్లడి కానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 30 May 2023 10:23 AM (IST) Tags: LIC ADO Result 2023 LIC ADO Mains Result 2023 LIC ADO Main 2023 Results LIC ADO Mains Result

ఇవి కూడా చూడండి

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా

Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు, వివరాలు ఇలా

AIIMS: ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS: ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం