LIC AAO 2025: LICలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. 881 పోస్టులకు నోటిఫికేషన్
LIC AAO Jobs 2025కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకింగ్-ఇన్సూరెన్స్ రంగంలో కెరీర్ను ప్రారంభించాలనుకుంటే, స్థిరమైన ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు ఇది గొప్ప అవకాశం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టులు భర్తీ చేస్తుంది. మొత్తం 881 ఏఏఓ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు LIC అధికారిక వెబ్సైట్ licindia.in లో సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత ఏమిటి?
AAO పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి పట్టా పొందిన వారికే అవకాశం.
వయోపరిమితి
ఏఏఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేసిన కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి (Maximum Age Limit)లో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరీ (General) అభ్యర్థులు, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యర్థులు రూ. 700 దరఖాస్తు రుసుము చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (PwBD) కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి రాయితీ లభిస్తుంది. వారు కేవలం ఎగ్జామ్‌కు సంబంధించి నామినల్ ఛార్జ్ మాత్రమే చెల్లించాలి. అటువంటి అభ్యర్థులు కేవలం రూ. 85 చెల్లించాలి.
AAO ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది..
LIC AAO రిక్రూట్మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ మొత్తం 3 దశల్లో పూర్తవుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అవకాశం లభిస్తుంది. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాతే అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్ కు అర్హత సాధిస్తారు. తుది మెరిట్ జాబితాను ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఫలితాలతో పాటు ఇంటర్వ్యూలలో వచ్చిన మార్కుల ఆధారంగా తయారు చేస్తారు.
ఎగ్జామ్ విధానం
- ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది, ఇందులో ఆప్షనల్ ప్రశ్నలు అడుగుతారు.
- మెయిన్స్ పరీక్షలో సబ్జెక్టివ్ ప్రశ్నలతో పాటు, ఇంగ్లీష్ భాష మరియు సాధారణ జ్ఞానం నుండి కూడా ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష ఖచ్చితమైన సరళి, సిలబస్ ఏంటి అనేది ఎల్ఐసీ అధికారిక నోటిఫికేషన్లో వివరంగా ఇచ్చారని అభ్యర్థులకు సూచించారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
- అభ్యర్థులు LIC అధికారిక వెబ్సైట్ licindia.in ని సందర్శించాలి
- హోమ్ పేజీలోని "Careers" విభాగంలోకి వెళ్లి రిక్రూట్మెంట్ లింక్ మీద క్లిక్ చేయండి.
- కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వారు మీ ప్రాథమిక సమాచారాన్ని ఎంటర్ చేయాలి
- అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా ఫిల్ చేయండి. తరువాత అక్కడ అడిగిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజును ఆన్లైన్లో చెల్లించండి.
- సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫారం ప్రింట్ అవుట్ తీసి ఉంచుకోవడం బెటర్





















