LIC AAO Admit Card 2025: ఎల్ఐసీ ఏఏవో ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు ఎప్పుడు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ?
LIC AAO Admit Card 2025: ఎల్‌ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి చాలా రోజు క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పరీక్ష తేదీని అక్టోబర్ 3న నిర్వహించనున్నారు.

LIC AAO Admit Card 2025: జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం లక్షల మంది అప్లై చేసుకున్నారు. వీళ్లంతా పరీక్ష, హాల్‌టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది.
ఎల్‌ఐసీలో ఏఏవో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను వారం రోజుల ముందు విడుదల చేస్తారు. అంటే ఈ పరీక్షకు బంధించిన హాల్ టికెట్లను సెప్టెంబర్ నెలాఖరున జారీ చేయనున్నారు. ఒకసారి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను పెట్టిన తర్వాత అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఏం చేయాలి
ఎల్‌ఐసీ ఏఏవో ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు ఈ నెల 25 లేదా 26 తేదీల్లో వెబ్‌సైట్‌లో పెడతారు. అలా పెట్టిన హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ licindia.in.కు వెళ్లాలి.
- వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్‌లో రిక్రూట్‌మెంట్ సెక్షన్ ఉంటుంది.
- రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో LIC AAO Admit Card 2025 అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అలా క్లిక్ తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు లాగిన్ అయ్యేందుకు వివరాలు అందజేయాలి.
- ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీ హాల్‌టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- కనిపించిన హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
LIC AAO Admit Card 2025 ప్రిలిమినరీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పూర్తిగా అబ్జెక్టివ్ టైపు క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మూడు సెక్షన్‌లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు ప్రత్యేక సమయం ఇస్తారు. నెగిటివ్ మార్కులు లేవు. ప్రతి సెక్షన్‌లో కూడా అభ్యర్థులు క్వాలిఫై అవ్వాలి. ఒక సెక్షన్‌లో మంచి మార్కులు వచ్చి వేరే సెక్షన్ క్వాలిఫై ఆయ్యే మార్కులు రాకపోతే అతన్ని డిస్‌క్వాలిఫై చేస్తారు.
LIC AAO Admit Card 2025 ప్రిలిమినరీ పరీక్ష వంద ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లిష్ కేవలం అర్హతకు సంబంధించింది మాత్రమే. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చినా ఫైనల్ మార్క్‌లలోకి ర్యాంకింగ్‌లోకి పరిగణలోకి తీసుకోరు.





















