APPSC Group 2 Application: నేటితో ముగియనున్న 'గ్రూప్-2' పోస్టుల దరఖాస్తు గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి
ఏపీలో 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేటితో (జనవరి 17తో) ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే దరఖాస్తులు సమర్పించాలి.
APPSC Group2 Application: ఏపీలో 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేటితో (జనవరి 17తో) ముగియనుంది. అభ్యర్థులు జనవరి 17న అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే దరఖాస్తులు సమర్పించాలి. వాస్తవానికి జనవరి 10తో ముగియాల్సిన గడువును అభ్యర్థుల వినతుల మేరకు వారంరోజులపాటు పొడిగించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
గ్రూప్-2 ఉద్యోగాలకు డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జవనరి 17తో గడువు ముగియనుంది.
గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
* గ్రూప్-2 పోస్టులు
ఖాళీల సంఖ్య: 899
➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333
➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566
అర్హత: డిగ్రీ, ఆపై విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంది.
గ్రూప్-2 పోస్టుల అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష విధానం:
ALSO READ:
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 214 కోచ్ పోస్టులు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ కోచ్, సీనియర్ కోచ్, కోచ్, హై పెర్ఫార్మెన్స్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..