అన్వేషించండి

UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలసిందే. సెప్టెంబరు 26తో గడువు ముగియనుంది

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలసిందే. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. సెప్టెంబరు 26తో గడువు ముగియనుంది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. 

వివరాలు..

* ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024

పోస్టుల సంఖ్య: 167

విభాగాలు: సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్.

సంస్థలు: ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్, నావెల్ అర్మామెంట్ సర్వీసెస్, జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).

విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ డిగ్రీ/ రేడియో రెగ్యులేటరీ సర్వీసెస్‌లో పోస్టులకు ఫిజిక్స్ లేదా రేడియో ఫిజిక్స్/ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

వ‌యోప‌రిమితి:
 01.01.2024 నాటికి నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం:
 యూపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

➦ రాత‌ప‌రీక్ష,  ఇంటర్వ్యూ/పర్సనల్ టెస్ట్, మెడికల్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

➦ ప‌రీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమిన‌రీ (స్టేజ్‌-1), మెయిన్స్ (స్టేజ్-2).

➦ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన‌వారిని మెయిన్‌ ప‌రీక్షకు ఎంపిక చేస్తారు.

➦ మెయిన్స్ వచ్చిన మార్కులను ఆధారంగా స్టేజ్-3 పర్సనాలిటి టెస్ట్(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. 

పరీక్ష ఇలా...

➦ ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 500 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 200 మార్కులకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షకు 2 గంటలు, పేపర్-1 పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

➦ మెయిన్ పరీక్ష: మొత్తం 600 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 300 మార్కులకు పేపర్-1 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు.  ఒక్కో పేపర్‌కు 3 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. కన్వెన్షల్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నంలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 06.09.2023.

➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రితేదీ: 26.09.2023.

➦ దరఖాస్తుల సవరణ తేదీలు: 27.09.2023 - 03.10.2023.

➦ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ: 18.02.2024.

Notification

Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget