(Source: ECI/ABP News/ABP Majha)
KVS Exam: కేంద్రీయ విద్యాలయ ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూలులో మార్పులు! కొత్త తేదీలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ విభాగాల్లో మొత్తంగా 13,404 పోస్టులను భర్తీ చేసేందుకు దశల వారీగా ఫిబ్రవరి 7నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల షెడ్యూలులో మార్పులు చేస్తున్నట్లు కేవీఎస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పరీక్ష తేదీలను సవరించినట్టు పేర్కొంది. సవరించిన తేదీలు, షిఫ్టుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు అసిస్టెంట్ కమిషనర్ పేపర్-1; పేపర్-2లతో పాటు ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్, పీఆర్‌టీ మ్యూజిక్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తయిన సంగతి తెలిసిందే.
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ అసిస్టెంట్ కమిషనర్
పరీక్షతేది: 07.02.2023
➥ ప్రిన్సిపల్
పరీక్షతేది: 08.02.2023
➥ వైస్ ప్రిన్సిపల్ & పీఆర్‌టీ (మ్యూజిక్)
పరీక్షతేది: 09.02.2023
➥ టీజీటీ
పరీక్షతేది: 12-14 ఫిబ్రవరి 2023
➥ పీజీటీ
పరీక్షతేది: 17-20 ఫిబ్రవరి 2023
➥ హిందీ ట్రాన్స్‌లేటర్
పరీక్షతేది: 20.02.2023
➥ పీఆర్‌టీ
పరీక్షతేది: 21-28 ఫిబ్రవరి 2023
➥ పీజీటీ (సీఎస్)
పరీక్షతేది: 23 ఫిబ్రవరి 2023
➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
పరీక్షతేది: 01-05 మార్చి 2023.
➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II
పరీక్షతేది: 05.03.2023
➥ లైబ్రేరియన్
పరీక్షతేది: 06.03.2023.
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ & సీనియర్ సెక్రిటేరియట్ అసిస్టెంట్
పరీక్షతేది: 11.03.2023.
6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం!
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఎత్తు విషయంలో అనుత్తీర్ణులైన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) గుడ్ న్యూస్ తెలిపింది. పీఈటీ/ పీఎంటీ పరీక్షల్లో 1 సెం.మీ., అంతకంటే తక్కువ ఎత్తులో అనుత్తీర్ణులైన అభ్యర్థులకు మరోసారి పీఎంటీ/ పీఈటీ కోసం దరఖాస్తు చేసుకోవాలని నియామక మండలి సూచించింది. ఈ అభ్యర్థులు ఫిబ్రవరి 10న ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 12న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలని బోర్డు స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు పత్రం, అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అంబర్‌పేట్ (హైదరాబాద్) పోలీస్ గ్రౌండ్స్, కొండాపూర్(రంగారెడ్డి జిల్లా)లోని బెటాలియన్‌లో పీఎంటీ/ పీఈటీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ల్యాబ్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ - 03 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ సైన్సెస్ - 02 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ బయోలాజికల్ - 05 పోస్టులు సైన్సెస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..