APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ల్యాబ్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ - 03 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ సైన్సెస్ - 02 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ బయోలాజికల్ - 05 పోస్టులు సైన్సెస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నిరు. ఆయా విభాగాల్లో బీఎస్సీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఫిబ్రవరి 23లోగా తమ దరఖాస్తులను స్పీడ్ పోస్టు ద్వారా సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.
వివరాలు..
* ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 10
విభాగాలవారీగా ఖాళీలు: ఫిజిక్స్ - 03 పోస్టులు, కెమిస్ట్రీ - 02 పోస్టులు, బయాలజీ - 05.
విద్యార్హతలు..
➥ ఫిజికల్ సైన్సెస్ పోస్టులకు ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
➥ కెమికల్ సైన్సెస్ పోస్టులకు కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ బయోలాజికల్ సైన్సెస్ పోస్టులకు బోటనీ, జువాలజీ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులు కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 34 సంవత్సరాలు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, రాతపరీక్ష, పని అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో విద్యార్హతలకు 20 మార్కులు, రాతపరీక్షకు 50 మార్కులు, పని అనుభవానికి 20 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
జీతభత్యాలు: నెలకు రూ.20,000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director,
AP State Forensic Science Laboratory,
4th Floor, Tech Tower,
Opp: AP DGP Office,
Mangalagiri, Guntur-522503.
Also Read:
సీడాక్‌లో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..