IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు!
డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
వివరాలు..
1) ఎగ్జిక్యూటివ్ లెవెల్-1: 96 పోస్టులు
2) ఎగ్జిక్యూటివ్ లెవెల్-2: 10 పోస్టులు
అర్హత: డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28.02.2023 నాటికి ఎగ్జిక్యూటివ్ లెవెల్-1 పోస్టులకు 35 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ లెవెల్-2 పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.300.ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: ఎగ్జిక్యూటివ్ లెవల్-1 పోస్టులకు ఏడాదికి 12 లక్షలు, ఎగ్జిక్యూటివ్ లెవల్-1 పోస్టులకు ఏడాదికి 16 లక్షలు జీతంగా ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2023.
➥ ఆన్‌లైన్ చెల్లింపు చివరి తేదీ: 21.03.2023.
➥ ఇంటర్వ్యూ తేదీ: మే నాలుగో వారం.
Online Application Form
Website
Also Read:
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5,395 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 5,395 ఐటీఐ, నాన్ ఐటీఐ ఖాళీలను భర్తీచేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.
యంత్ర ఇండియా లిమిటెడ్ పరిధిలో ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, వెహికల్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ- అంబర్‌నాథ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- మెదక్ తదితర సంస్థలు పనిచేస్తున్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..