Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో 2500 ఉద్యోగాలు - ఇంటర్ పాసయ్యారా, ఈ జాబ్స్ మీకోసమే
Indian Navy Recruitment 2022: భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియన్ నేవీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ నేవీ సెయిలర్ ఆగస్టు 2022 బ్యాచ్ కోసం భర్తీ ప్రక్రియను చేపట్టారు.
Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియన్ నేవీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ నేవీ సెయిలర్ ఆగస్టు 2022 బ్యాచ్ కోసం భర్తీ ప్రక్రియను చేపట్టారు. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఏఏ–ఎస్‌ఎస్‌ఆర్ సెయిలర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ వివరాలు తెలుసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ తేలిక అవుతుంది. ప్లాన్ ప్రకారం చదివితే ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశాలు మెరుగవుతాయి.
2500 పోస్టులకు భారీ నోటిఫికేషన్..
ఇండియన్ నేవీలో మొత్తం 2500 ఖాళీలను భర్తీ (Indian Navy SSR Recruitment 2022) చేయనున్నారు. ఆర్టిఫీషర్ అప్రెంటిస్, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు సంపాదించేందకు ఇది మంచి అవకాశం. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే శారీరక ప్రమాణాలతో పాటు ఇంటర్ లో కనీస అర్హత మార్కులు, వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టు పేరు, ఖాళీల సంఖ్య..
ఆర్టిఫీషర్ అప్రెంటిస్) - 500 పోస్టులు
సీనియర్ సెకండరీ రిక్రూట్స్ - 2000 పోస్టులు
దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్
సెలక్షన్ ప్రాసెస్..
CBT Written-test
Physical Fitness test
Medical test
ఇంటర్ మార్కుల వెయిటేజీతో మెరిట్ తీస్తారు. ఆపై రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
విద్యార్హత - మ్యాథ్స్/ ఫిజిక్స్ / కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) లేదా దాంతో సమానమైన కోర్సులో 60 శాతం లేదా ఆపైన మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
వయసు - దరఖాస్తు చేసుకునే వారు 2002 ఆగస్ట్ 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి ఉన్న వారు అర్హులు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులు ప్రారంభం - మార్చి 29, 2022
తుది గడువు తేదీ - ఏప్రిల్ 5, 2022
వేతనం ; ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో స్టైపెండ్ కింద నెలకి రూ. 14,600 అందిస్తారు.
శిక్షణ తరువాత లెవల్ 3 కింద నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 పే స్కేల్ ప్రకారం చెల్లింపులు ఉంటాయి.
Also Read: NTPC Recruitment 2022 : ఎన్టీపీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్, చివరి తేదీ ఎప్పుడంటే?