Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఇంజినీరింగ్, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
ఆగస్టు 18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆగస్టు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 2023 జనవరిలో శిక్షణ ప్రారంభమవుతుంది.
ఇండియన్ నేవీలో'10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్' ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు జేఈఈ మెయిన్-2022 పరీక్షలో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆగస్టు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 2023 జనవరిలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం వీరికి నేవీలోనే ఉన్నత హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
వివరాలు...
* 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్) - జనవరి 2023
బ్రాంచ్‌లవారీగా ఖాళీల సంఖ్య: 36
1) ఎగ్జిక్యూటివ్ & టెక్నికల్ బ్రాంచ్: 31
2) ఎడ్యుకేషన్ బ్రాంచ్: 05
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో 70 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. జేఈఈ మెయిన్-2022 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు - కనీసం 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయసు: 17 - 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి 02.01.2003 - 01.07.2006 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం..
➦ జేఈఈ మెయిన్-2022 ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది.
➦ ఎంపికైనవారికి ఎస్‌ఎస్‌బీ బోర్డు సెప్టెంబరు-అక్టోబరు మధ్య బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్, వైజాగ్‌లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
➦ రెండు దశల్లో ఇంటర్వ్యూ ప్రక్రియ ఉంటుంది. 'స్టేజ్-1'లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ ప్రిసిప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని 'స్టేజ్-2'కు ఎంపిక చేస్తారు. 'స్టేజ్-2'లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
శిక్షణ వివరాలు..
➦ ఎంపికైన అభ్యర్థులకు కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఇంజినీరింగ్ (బీటెక్) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. నేవీ అవసరాల మేరకు అభ్యర్థులకు ఇంజినీరింగ్‌లో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సబ్జెక్టులను బోధిస్తారు.
➦ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీటెక్ డిగ్రీని అందజేస్తుంది. అనంతరం వారికి నేవీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
పేస్కేల్: ఇంజినీరింగ్ డిగ్రీ అందుకున్న అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు. వీరికి నెలకు సుమారుగా రూ.83,448-96,204 జీతం చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 18.08.2022.
➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28.08.2022.
➦ కోర్సు ప్రారంభం: జనవరి 2023.
Notification
Website
Also Read:
SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ITBP Constable Notification: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...