ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. సెప్టెంబరు 22తో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే దరఖాస్తు గడువును సెప్టెంబరు 27 వరకు అధికారులు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించని వారు వెంటనే అప్లయ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్‌మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.
వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 350
1) నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
2) నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): 30 పోస్టులు
3) యాంత్రిక్(మెకానికల్): 25 పోస్టులు
4) యాంత్రిక్(ఎలక్ట్రికల్): 20 పోస్టులు
5) యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు
అర్హత: నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టులకు ఇంటర్ (ఎంపీసీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదోతరగతి అర్హత ఉండాలి. ఇక యాంత్రిక్ పోస్టులకు పదోతరగతితోపాటు ఇంజినీరింగ్ డిప్లొమా(ఎలక్ట్రికల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.05.2002 - 30.04.2006 మధ్య జన్మించి ఉండాలి.
పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, అసెస్‌మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08.09.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.09.2023.
ALSO READ:
ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం- అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ(అగ్రికల్చర్) డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 7లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవిదేశాల్లో నెలకొన్న ఇఫ్‌కో కేంద్రాలు/కార్యాలయాలు/ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో రూ.33,000 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ తర్వాత ఉద్యోగంలో చేరినవారికి నెలకు రూ.37,000-రూ.70,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 434 స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో భర్తీ చేస్తారు. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 21న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..