IFFCO Notification: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం- అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం- అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ(అగ్రికల్చర్) డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 7లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవిదేశాల్లో నెలకొన్న ఇఫ్‌కో కేంద్రాలు/కార్యాలయాలు/ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో రూ.33,000 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ తర్వాత ఉద్యోగంలో చేరినవారికి నెలకు రూ.37,000-రూ.70,000 జీతం ఉంటుంది.
వివరాలు...
* అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నవంబర్, 2023 నాటికి చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.33,000 స్టైపెండ్ అందుతుంది. అనంతరం రూ.37,000-రూ.70,000 జీతం ఇస్తారు. దీనికి ఇతర అలెవెన్సులు అదనంగా చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, లక్నో, నాగ్‌పుర్, గువాహటి, పట్నా, రాయ్‌పుర్, సూరత్, వారణాసి, చండీగఢ్, డెహ్రాడూన్, పుణె, కొచ్చిన్, జోధ్‌పుర్, జమ్మూ, సిమ్లా, భోపాల్, జబల్‌పూర్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.10.2023.
ALSO READ:
ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 434 స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో భర్తీ చేస్తారు. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 21న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ అర్హతతో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఈ పోస్టులను ఐడీబీఐ భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..