Indian Army: బీటెక్, డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో 381 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
ఇండియన్ ఆర్మీలో 63వ, 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 381 ఖాళీలను భర్తీచేయనున్నారు.
Indian Army SSC Technical and Non Technical Recruitment: ఇండియన్ ఆర్మీలో 63వ, 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 381 ఖాళీలను భర్తీచేయనున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టెక్నికల్ కోర్సులకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్-టెక్నికల్ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కోర్సు అక్టోబర్ 2024లో ప్రీ- కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభం కానుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు జనవరి 23న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండు దశల రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 381.
➥ 63వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) పురుషులు: 350 పోస్టులు
ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.
➥ 34వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 29 పోస్టులు
ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
➥ ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ (టెక్నికల్): 1 పోస్టు
➥ ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ (నాన్-టెక్నికల్): 1 పోస్టు
అర్హత: టెక్నికల్ విభాగాలకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్; నాన్-టెక్నికల్ విభాగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2024 నాటికి 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పే స్కేల్: రూ.56,100- రూ.1,77,500.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.02.2024.
➥ కోర్సు ప్రారంభం: అక్టోబర్ 2024.
ALSO READ:
‘అగ్నివీర్ వాయు’ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు ఇన్‌టేక్ (01/2025) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభంమైంది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఫిబ్రవరి 6లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక పరీక్షలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా ఆధార్‌కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే సికింద్రాబాద్-12 ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్‌ను 040-27753500 నంబరులో లేదా ఈమెయిల్: co.12asc-ap@gov.in ద్వారా సంప్రదించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..