Army Agniveer Admit Card: ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్‌కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
అగ్నివీర్ జనరల్ డ్యూటీ విభాగం హాల్‌టికెట్లు ఏప్రిల్ 5న విడుదలకాగా.. ఏప్రిల్ 8 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక మిగతా విభాగాల హాల్‌టికెట్లు ఏప్రిల్ 11న సాయంత్రం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు సంబంధించిన రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ విభాగానికి సంబంధించిన హాల్‌టికెట్లు ఏప్రిల్ 5న విడుదలకాగా.. ఏప్రిల్ 8 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక మిగతా విభాగాలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఏప్రిల్ 11న సాయంత్రం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
అగ్నివీర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
ఈ పరీక్ష ద్వారా ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, స్టోర్ కీపర్, క్లర్క్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
ఇండియన్ ఆర్మీలో 'అగ్నివీరుల' నియామకాలకు సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి మార్చి 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఏడాది ఆర్మీ అగ్నిపథ్ స్కీమ్-2023 కింద దాదాపు 25 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఆర్మీ ఇందుకోసం పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
సీజీఎల్ఈ-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ సారి 7500 వరకు ఖాళీల భర్తీ - దరఖాస్తు ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1031 ఉద్యోగాలు, వీరికి ప్రత్యేకం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1031 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్, ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమరావతి పరిధిలో 69 పోస్టులు, హైదరాబాద్ పరిధిలో 45 పోస్టులు ఉన్నాయి. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగై ఉండాలి. ఏటీఎం ఆపరేషన్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..