Indian Air Force Recruitment 2025 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ 2025.. ఇంటర్ అర్హతతో జాబ్, పూర్తి వివరాలివే
Indian Air Force : ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం. అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ఎలా అప్లే చేయాలో, అర్హతలు ఏంటో చూసేద్దాం.

Indian Air Force Agniveervayu Recruitment 2025 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ కోసం అఫీషయల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అగ్నివీర్వాయు పోస్ట్లకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అఫీషియల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్లో అప్లై చేయవచ్చు. మరి దీనిని ఎలా అప్లై చేయాలి? అర్హతలు ఏంటి? ముఖ్యమైన తేదీలు? తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు ఇవే..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2025లో భాగంగా అగ్నివీర్వాయు పోస్టుల కోసం అప్లై చేయాలనుకునేవారు ఇంటర్మీడియట్ లేదా డిప్లమో చేసిన వారు అప్లై చేయవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్‌తో కూడిన కోర్సు పూర్తి చేసి.. వారి ఎడ్యూకేషన్ బోర్డ్‌కి కేంద్రం, రాష్ట్ర బోర్డుల గుర్తింపు ఉండాలి.
వయసు
వయసు 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేయవచ్చు. జూలై 2, 2005, జనవరి 2, 2009 మధ్య జన్మించిన అభ్యర్థులు కూడా దీనికి అర్హులే. అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో అన్ని దశల్లో ఉత్తీర్ణులైతే.. నమోదు చేసిన తీదీ నాటికి వయోపరిమితి 21 సంవత్సరాలు ఉండాలి.
ముఖ్యమైన తేదీలివే
జూలై 11వ తేదీ 2025 నుంచి.. 31-07-2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష 25-9-2025 నుంచి నిర్వహించవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ రుసుము
అర్హతలున్న అభ్యర్థులు 550 రూపాయలు చెల్లించాలి. జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే దీనిని చెల్లించాల్సి ఉంటుంది.
జీతం
మొదటి సంవత్సరం 30,000.. రెండో సంవత్సరం 33,000.. మూడో సంవత్సరంలో 36,500.. నాలుగో సంవత్సరంలో 40,000 ఉంటుంది.
మెడికల్ టెస్ట్‌లు
ఆన్లైన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వ్యక్తులకు కొన్ని మెడికల్ టెస్ట్‌లు చేస్తారు. అంతేకాకుండా అభ్యర్థులు ఎత్తు, బరువు ఇతర విషయాలు చెక్ చేస్తారు. మరి అభ్యర్థులు ఎత్తు ఎంత ఉండాలి? బరువు వంటి విషయాలే కాకుండా ఇంకేమి టెస్ట్‌లు చేస్తారో తెలుసుకుందాం. అభ్యర్థులు
మగవారు అయినా, ఆడవారు అయినా ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు ఉండాలి. నార్త్ ఈస్ట్‌కి చెందిన వారికి 147 వరకు సడలింపు ఉంటుంది. బరువు వయసు, ఎత్తుకు తగ్గట్లు ఉండాలి. చెస్ట్ కొలతలు కూడా చెక్ చేస్తారు. వినికిడి సమస్యలు ఉండకూడదు. కంటి చూపు కూడా చెక్ చేస్తారు. డెంటల్ కూడా ఎలాంటి సమస్యలు ఉండకూడదు. ఆరోగ్య పరిస్థితులు కూడా నార్మల్‌గా ఉండాలి. ప్రెగ్నెన్సీతో ఉండేవారిని రిజెక్ట్ చేస్తారు.
ఈ క్వాలిటీలు మీలో ఉండి.. ఎత్తు, బరువుతో పాటు వయసు ఉండి.. అన్ని అర్హతలు ఉన్నవారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్వాయు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.






















