ISRO Recruitment 2025 : ఇస్రోలో సైంటిస్ట్, ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
ISRO Jobs : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో సైంటిస్ట్, ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ISRO Recruitment : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం చేయాలని కలలు కనే యువతకు శుభవార్త. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల 39 పోస్టుల భర్తీ కోసం ఇస్రో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతరిక్ష విజ్ఞానం, సాంకేతిక రంగంలో దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. భర్తీ ఎలా ఉంటుంది? ముఖ్యమైన తేదీలు, విద్యార్హత వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇస్రో గ్రూప్-ఎ కేటగిరీ కింద సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 24 నుంచి జూలై 14, 2025 మధ్య ISRO వెబ్‌సైట్ isro.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏయే పోస్టులకు భర్తీ ఉంటుంది?
- సివిల్ ఇంజనీరింగ్ – 18 పోస్టులు
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 10 పోస్టులు
- రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ – 9 పోస్టులు
- ఆర్కిటెక్చర్ – 1 పోస్టు
- అటానమస్ బాడీ కింద సివిల్ ఇంజనీర్ – 1 పోస్టు
విద్యార్హత ఏమిటి?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BE లేదా B.Tech చేసి ఉండాలి. దానిలో కనీసం 65% మార్కులు సాధించాలి. దీనితో పాటు సంబంధిత సబ్జెక్టులో నైపుణ్యం, నిర్దేశిత అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి
సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి జూలై 14, 2025 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST వర్గానికి చెందిన వారికి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఎంపిక ఎలా జరుగుతుంది?
పార్ట్ I లో సబ్జెక్టుకు సంబంధించిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు లభిస్తుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. పార్ట్ II లో ఆప్టిట్యూడ్, ఎబిలిటీకి సంబంధించిన 15 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఇది కూడా చదవండి: ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులకు నోటిఫికేషన్.. 6,180 పోస్టులు, అర్హతలు, పూర్తి వివరాలివే
ఎలా దరఖాస్తు చేయాలి?
- దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు మొదట ISRO అధికారిక వెబ్‌సైట్ isro.gov.inని ఓపెన్ చేయాలి.
- అనంతరం అభ్యర్థులు “కెరీర్స్” విభాగంలోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి.
- తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి.. సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
- అనంతరం అభ్యర్థులు ఫారమ్‌ను సబ్మీట్ చేయాలి.
- తర్వాత అభ్యర్థులు దీన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఇది కూడా చదవండి : IRCTCలో ఆధార్‌ను ఇలా లింక్ చేయండి, పూర్తి ప్రాసెస్ ఇదే.. తత్కాల్ టికెట్ కావాలంటే ఇది చేయాల్సిందే






















