పిల్లల నుంచి పెద్దల వరకు బుక్స్ చదివేప్పుడు చాలామందికి నిద్ర వస్తుంది.

అయితే అలా చదివేప్పుడు నిద్ర సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలట.

చదివేప్పుడు పడుకొని కాకుండా సరైన భంగిమలో కూర్చొని చదివితే మంచిది. మంచి లైటింగ్ ఉండేలా చూసుకోవాలి.

ప్రతి 25 నిమిషాలకోసారి 5 నిమిషాలు బ్రేక్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ మీపై ప్రెజర్​ని తగ్గిస్తుంది.

నిద్ర వస్తే చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ముఖ్యంగా కళ్లపై చల్లని నీటిని కొడితే మంచిది.

హైడ్రేటెడ్​గా ఉంటే చదివేప్పుడు నిద్ర రాకుండా యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.

చదివేముందు ఎక్కువ ఫుడ్ తినకూడదు. లైట్ ఫుడ్ తీసుకుంటే నిద్ర రాకుండా ఉంటుంది.

నట్స్, ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్ వంటివి నిద్రపోకుండా చదువుపై ఫోకస్ చేయవచ్చు.

డిమ్ లైట్స్​లో ఉంటే కళ్లు అలసిపోయి త్వరగా నిద్ర వస్తుంది. కాబట్టి లైటింగ్ ఎక్కువగా ఉండేలా చూడాలి.

గమ్, మింట్స్ లాంటివి తీసుకుంటే మీరు అలెర్ట్​గా ఉంటారు. కానీ లిమిటెడ్​గా తీసుకుంటే మంచిది.