అన్వేషించండి

IAF Recruitment: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌)' ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

Agnipath Scheme: 'అగ్నిపథ్' స్కీంలో భాగంగా 'అగ్నివీర్ వాయు(స్పోర్ట్స్‌)' నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

Indian Air Force Agniveervayu (Sports) Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 'అగ్నిపథ్' స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో 'అగ్నివీర్ వాయు(స్పోర్ట్స్‌)' నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ (02/ 2025) విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, మెడికల్ టెస్ట్‌, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.33,000; మూడో ఏడాది రూ.36,000; నాలుగో ఏడాది రూ.40,000 చెల్లిస్తారు. నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేవారికి 'సేవానిధి ప్యాకేజీ' కింద మొత్తంగా రూ.10.04 లక్షలు చెల్లిస్తారు.

వివరాలు..

* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)- అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు(స్పోర్ట్స్‌)(02/ 2025) బ్యాచ్ 

క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, క్రికెట్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, సైకిల్ పోలో, సైక్లింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, లాన్‌ టెన్నిస్‌, స్క్వాష్, స్విమ్మింగ్/ డైవింగ్, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్,  ఉషు.

స్పెసిఫిక్ ఈవెంట్/పోసిషన్/కేటగిరీ..

అథ్లెటిక్స్: (i) 110 మీ హర్డిల్స్, (ii) 800 మీ, (iii) 3000 మీ SC, (iv) లాంగ్ జంప్(v) హై జంప్, (vi) డిస్కస్ త్రో, (vii) హామర్ త్రో, (viii) రేస్ వాక్, (ix) పోల్ వాల్ట్.

క్రికెట్: (i) స్పిన్ బౌలర్ (లెగ్ స్పిన్/ ఎడమ చేయి), (ii) మిడిల్ ఆర్డర్ బ్యాటర్/వికెట్ కీపర్, (iii) ఆల్ రౌండర్.

బాక్సింగ్: (i) 46-48Kg, (ii) 48-51Kg, (iii) 54-57Kg, (iv) 63.5-67Kg, (v) 67-71Kg, (vi) 71-75Kg, (vii) 75-80 Kg, (viii) +92 Kg.

బాస్కెట్‌బాల్: (i) సెంటర్, (ii) పాయింట్ గార్డ్.

సైకిల్ పోలో: (i) డిఫెండర్, (ii) ఆల్ రౌండర్.

సైక్లింగ్: (i) 4 కి.మీ వ్యక్తిగత పరుగు, (ii) 10 కి.మీ స్క్రాచ్ రేస్.

ఫుట్‌బాల్: (i) డిఫెండర్, (ii) మిడ్‌ఫీల్డర్.

జిమ్నాస్టిక్స్: ఆల్ రౌండర్ ఫర్ సిక్స్ అప్పారాటస్.

హ్యాండ్‌బాల్: (i) గోల్ కీపర్, (ii) పివట్, (iii) ఆల్ రౌండర్.

హాకీ: (i) ఫుల్ బ్యాక్, (ii) మిడ్ ఫీల్డర్.

లాన్‌ టెన్నిస్‌: సింగిల్స్/ డబుల్స్.

స్క్వాష్: సింగిల్స్/ డబుల్స్.

స్విమ్మింగ్/ డైవింగ్: (i) హై బోర్డ్ డైవర్, (ii) స్ప్రింగ్ బోర్డ్ డైవర్, (iii) బటర్‌ఫ్లై 100 అండ్ 200 M, (iv) IM 200 అండ్ 400 M, (v) ఫ్రీ స్టైల్ 200, 400, 800 అండ్ 1500 M, (vi) బ్యాక్‌స్ట్రోక్ 50 అండ్ 100M.

కబడ్డీ: (i) ఎడమ కవర్, (లో) రైడర్, (iii) కుడి మూల, (ఆల్ రౌండర్).

షూటింగ్: (i) 10 M ఎయిర్ పిస్టల్, (ii) 10 M ఎయిర్ రైఫిల్, (iii) 50 M రైఫిల్ 3P, (iv) 25 M రాపిడ్ ఫైర్ పిస్టల్.

వాలీబాల్: (i) సెట్టర్, (ii) లిబెరో, (iii) ఎటాకర్.

వాటర్ పోలో: (i) ఆల్ రౌండర్, (ii) సెంటర్ ఫార్వర్డ్, (iii) రైట్ వింగ్, (iv) లెఫ్ట్ వింగ్.

వెయిట్ లిఫ్టింగ్: వెయిట్ కేటగిరీ- 60Kg, 65Kg, 71Kg, 79Kg, 110Kg, +110Kg (జూన్ 2025 నుంచి డబ్ల్యుఎఫ్‌ఐ కొత్త వెయిట్ కేటగిరీల ప్రకారం).

రెజ్లింగ్: గ్రీకో రోమన్: Wt. క్యాట్ 63 కిలోలు, 77 కిలోలు, 87 కిలోలు; ఫ్రీస్టైల్: Wt క్యాట్ 70 కిలోలు, 125 కిలోలు.

ఉషు: సండా- Wt క్యాట్ 70-75 కేజీ, 75-80 కేజీ, 85-90 కేజీ; తావోలు- నాన్‌క్వాన్.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/  తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 03.07.2004 నుంచి 03.01.2008 మధ్య జన్మించి ఉండాలి.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎత్తు: 152 సెం.మీ. ఉండాలి.

ట్రయల్స్ వేదిక: 
Tejas Camp, Air Force Station
New Delhi, Lok Kalyan Marg, 
New Delhi – 110003.

ముఖ్యమైన తేదీలు.. 

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13.02.2025.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 22.02.2025.

➥ రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ షెడ్యూల్: 10 నుంచి 12.03.2025 వరకు.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget