Income Tax Department Jobs: ఐటీ శాఖలో 291 ఎంటీఎస్, టాక్స్ అసిస్టెంట్ పోస్టులు - వీరికి ప్రత్యేకం!
Income Tax Recruitment: ముంబయిలోని ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ స్పోర్ట్స్ కోటా కింద వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు జనవరి 19లోగా దరఖాస్తులు సమర్పించాలి.
Income Tax Department Recruitment: ముంబయిలోని ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ స్పోర్ట్స్ కోటా కింద వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఇన్‌కమ్‌టాక్స్ ఇన్‌స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలున్నవారు జనవరి 19లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత క్రీడాంశాల్లో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* స్పోర్ట్స్ కోటా పోస్టులు
ఖాళీల సంఖ్య: 291.
➥ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 10 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.44,900 - రూ.1,42,400.
➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 10 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100.
➥ టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 10 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100.
➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 137 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 10 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.18,000 - రూ.56,900.
➥ క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 03 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 10 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.18,000 - రూ.56,900.
క్రీడాంశాలు: ఆర్చరీ, మల్లఖాంబ్, అథ్లెటిక్స్, మోటార్ స్పోర్ట్స్, అత్యాపత్యా, నెట్ బాల్, బ్యాడ్మింటన్, పారా స్పోర్ట్స్ (పారా-ఒలింపిక్స్, పారా ఏషియన్ గేమ్స్‌లో చేర్చబడిన క్రీడా క్రమశిక్షణ కోసం), బాల్-బ్యాడ్మింటన్, పెన్కాక్ సిలాట్, బేస్‌బాల్, పోలో, బాస్కెట్‌బాల్, పవర్ లిఫ్టింగ్, బిలియర్డ్స్ & స్నూకర్స్, షూటింగ్, బాడీ-బిల్డింగ్, షూటింగ్ బాల్, బాక్సింగ్, రోల్ బాల్, వంతెన, రోలర్ స్కేటింగ్, క్యారమ్, రోయింగ్, చెస్, రగ్బీ, క్రికెట్, సెపక్ తక్రా, సైక్లింగ్, సాఫ్ట్ బాల్, సైకిల్ పోలో, సాఫ్ట్ టెన్నిస్, డెఫ్ స్పోర్ట్స్, స్క్వాష్, ఈక్వెస్ట్రియన్, ఈత, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్, ఫుట్‌బాల్, టైక్వాండో, గోల్ఫ్, టెన్ని-కోయిట్, జిమ్నాస్టిక్స్, టెన్నిస్, హ్యాండ్‌బాల్, టెన్పిన్ బౌలింగ్, హాకీ, ట్రయాథ్లాన్, ఐస్-హాకీ, టగ్-ఆఫ్-వార్, ఐస్-స్కేటింగ్ 59 వాలీబాల్, ఐస్-స్కీయింగ్, వెయిట్ లిఫ్టింగ్, జూడో, వుషు, కబడ్డీ, రెజ్లింగ్, కరాటే, యాటింగ్, కయాకింగ్ & కానోయింగ్, టెన్నిస్ బాల్ క్రికెట్, ఖో-ఖో, యోగాసనం, కూడో.
దరఖాస్తు ఫీజు: రూ.200.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.01.2024.