IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌లో 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ(కంప్యూటర్ అప్లికేషన్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
![IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌లో 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా! IIT Kanpur invites applications for the recruitment of Junior Assistant posts,apply here IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌లో 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/0f16c4f4c854d9dce565788802afc12c1665489807977522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ(కంప్యూటర్ అప్లికేషన్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 9లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
* జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.
మొత్తం ఖాళీలు: 119
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(కంప్యూటర్ అప్లికేషన్) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.700.
జీతం: నెలకు రూ.21700-రూ.69100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ జాబ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.10.2022
దరఖాస్తు చివరి తేది: 09.11.2022
Notification
Online Application
Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో 128 రిలీజియస్ టీచర్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్‌టీ 91 & 92 కోర్సుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీజీఎల్ఈ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' దరఖాస్తు గడువును అక్టోబరు 13 వరకు పొడిగిస్తూ స్థాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి అక్టోబరు 8తో ముగియాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మరో వారంపాటు పొడిగించింది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు అక్టోబరు 13లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 14 వరకు, చలనా ద్వారా అక్టోబరు 15 వరకు అవకాశం కల్పించారు. ఇక దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే అక్టోబరు 19, 20 తేదీల్లో సరిచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్-హైదరాబాద్‌లో టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టెలికమ్యూనికేషన్ శాఖలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలు ఉండాలి!
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌లో ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15000 ఇంటర్న్‌షిప్‌గా ఇస్తారు. ఇంటర్నిషిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)