అన్వేషించండి

IBPS PO Admit Card: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు వచ్చేసింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 15, 16, 22 తేదీల్లో ఐబీపీఎస్ పీవో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేసి ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డు పొందవచ్చు.

ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అక్టోబరు 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డు పొందవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 15, 16, 22 తేదీల్లో ఐబీపీఎస్ పీవో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. 


అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Online Prelims Exam Call Letter for IBPS PO' లింక్ మీద క్లిక్ చేయాలి. 
Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి. 
Step 4: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.
Step 4:  అడ్మిట్ కార్డు డౌన్‌‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షరోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లడం మంచిది. 

IBPS PO ప్రిలిమ్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

 

Also Read:    ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు వచ్చేసింది, పరీక్ష ఎప్పుడంటే?



పోస్టుల వివరాలు..

* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 6432 పోస్టులు

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:

  1. కెనరా బ్యాంక్: 2500
  2. యూకో బ్యాంక్: 550
  3. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535
  4. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500
  5. పంజాబ్ సింధ్ బ్యాంక్: 253
  6. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094

వాస్తవానికి మరో ఐదు ప్రభుత్వ బ్యాంకులు (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌) కూడా ఐబీపీఎస్‌ ద్వారానే నియామకాలు చేపడుతుంటాయి. 2023–24 సంవత్సరంలో ఖాళీలకు సంబంధించి ఈ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో 6 బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి మాత్రమే ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌యోపరిమితి: 01.08.2022 నాటికి 20 - 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1992 - 01.08.2002 మధ్య జన్మంచి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన వారికి 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి

ఎంపిక‌ విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంట‌ర్వ్యూ ద్వారా.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 నిమిషాలు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 35 20 నిమిషాలు
రీజినింగ్ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం  100 100 60 నిమిషాలు

మెయిన్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌  45 60 60 నిమిషాలు
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌  40 40 35 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌   35 40 40 నిమిషాలు
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 60 45 నిమిషాలు
మొత్తం  155 200 3 గంటలు


ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ ప్రారంభం    : 02.08.2022

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది         : 22.08.2022

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌                        : సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్                                                         : సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌            : అక్టోబ‌ర్‌ 2022.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష                                                            : అక్టోబ‌రు 2022.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు                                            : న‌వంబ‌రు 2022.

మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌                               : న‌వంబ‌రు 2022.

మెయిన్ ఎగ్జామ్                                                                : న‌వంబ‌రు 2022.

మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు                                                : డిసెంబ‌రు 2022.

ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌                                      : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023.

ఇంట‌ర్వ్యూ                                                                       : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023

నియామకం                                                                      : ఏప్రిల్ 2023.

 

Notification

Website

 

Also Read:

Central Bank: సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


SBI Jobs: ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీ, పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

ప్రభుత్వరంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు!

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 346 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 20 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్య్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపం చూపించబోతున్నాడా?
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపం చూపించబోతున్నాడా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CSK Slumps Another Away Loss | చెపాక్ బయట ఆడాలంటే తిప్పలు పడుతున్న CSK | IPL 2024MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపం చూపించబోతున్నాడా?
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపం చూపించబోతున్నాడా?
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Embed widget