IBPS Clerks Main Exam Admit Card: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు వచ్చేసింది, పరీక్ష ఎప్పుడంటే?
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ మోదుచేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సెప్టెంబరు 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు.
అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Online Main Exam Call Letter' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి.
Step 4: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.
Step 4: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షరోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లడం మంచిది.
Download IBPS Clerks Online Main Exam Admit Card
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షను సెప్టెంబరు 3, 4 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను సెప్టెంబరు 21న విడుదల చేశారు. అక్టోబరు 8 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. స్కోరు కార్డు వివరాలను సెప్టెంబరు 27న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 8న ఐబీపీఎస్ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
Download IBPS Clerks Preliminary Exam Score Card
దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 6 వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 1 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 21 ఫలితాలను విడుదల చేసింది. స్కోరు కార్డు వివరాలను సెప్టెంబరు 27న విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబరు 8న మెయిన్ పరీక్షలకు అర్హత సాధిస్తారు.
మెయిన్ పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 190 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు-60 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.
ప్రతిసంవత్సరం, ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఐబీపీఎస్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
Also Read:
Central Bank: సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
SBI Jobs: ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీ, పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
ప్రభుత్వరంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..