IBPS Clerk Main Result 2022 : ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ రిజెల్ట్స్ విడుదల, ఇలా చెక్ చేసుకోండి
IBPS Clerk Main Result 2022 : ఐబీపీఎస్ క్లర్క్(మెయిన్స్) ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను ఐబీపీఎస్ అధికారిక సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
IBPS Clerk Main Result 2022 : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ బోర్డ్ (IBPS) శుక్రవారం ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది. IBPS క్లర్క్ (మెయిన్) పరీక్షకు హాజరైన అభ్యర్థులు, అధికారిక వెబ్‌సైట్ - https://ibps.in/ లో లాగిన్ ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలను అభ్యర్థి లాగిన్ ద్వారా వారి రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్, పాస్‌వర్డ్ /DOB(DD-MM-YY) క్యాప్చా కోడ్‌ని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. IBPS క్లర్క్ మెయిన్స్ పరీక్ష 2021 (CRP క్లర్క్ XI) 25 జనవరి 2022న నిర్వహించింది. ఎంపికైన అభ్యర్థులకు తాత్కాలిక కేటాయింపులు చేశారు. ప్రతి అభ్యర్థి ఆన్‌లైన్ మెయిన్ పరీక్షలో మినిమమ్ స్కోర్‌ను పొందాల్సి ఉంటుంది. తదుపరి ప్రక్రియ కోసం కనీస స్కోర్‌ను కూడా పొందాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీల సంఖ్యను బట్టి, కటాఫ్‌లు నిర్ణయిస్తారు. వీటిని తాత్కాలిక కేటాయింపు కోసం పరిగణిస్తారు. తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే ముందు ఆన్‌లైన్ మెయిన్ పరీక్షలో పొందిన స్కోర్లు అభ్యర్థులతో తెలియజేస్తారు.
తాత్కాలిక కేటాయింపులు
మెయిన్ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు 200. తాత్కాలిక కేటాయింపు కోసం 100 మార్కులకు కుదిస్తారు. ఒక అభ్యర్థి ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించాలి. తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ కోసం మెరిట్‌లో ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు IBPS వెబ్‌సైట్‌లో తర్వాత అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల జాబితా (రిజిస్టేషన్ నంబర్ ఆధారంగా రాష్ట్రాలు / UT వారీగా) తాత్కాలికంగా IBPS కేటాయించింది. ఈ వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ లో మే 1, 2022 లేదా అంతకు ముందు అందుబాటులో ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు మెరిట్-కమ్-ప్రిఫరెన్స్ ఆధారంగా, పార్టిసిపేటింగ్ బ్యాంక్‌లలో ఒకదానికి తాత్కాలికంగా కేటాయిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే స్కోర్ సాధిస్తే మెరిట్ ఆర్డర్ పుట్టిన తేదీ ప్రకారం నిర్ణయిస్తారు.
IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in పై క్లిక్ చేయండి
- 'CRP-క్లర్క్స్-XI మీ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఫలితాలను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి' ఈ లింక్‌పై క్లిక్ చేయండి. మీ స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్, పాస్‌వర్డ్ / DOB(DD-MM-YY) క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి. ఆపై సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
- IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితం స్క్రీన్‌పై వస్తుంది. డౌన్‌లోడ్ చేయండి
- భవిష్యత్ అవసరాల కోసం ఫలితాన్ని ప్రింటౌట్ తీసుకోండి.