News
News
వీడియోలు ఆటలు
X

TSPSC Paper Leak: పేపర్ లీకేజీలో పెద్ద తలకాయలు ఉన్నాయా? డైరీలో లేని వివరాలు వారికెలా తెలిశాయి?

కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డికి కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా తెలిసింది? అనేది చిక్కుముడిగా మారింది.

FOLLOW US: 
Share:

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డికి కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా తెలిసింది? అనేది చిక్కుముడిగా మారింది. మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంతవరకు 18 మంది నిందితులను గుర్తించి.. 17 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించిన రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉన్నట్లు సిట్ పోలీసులు గుర్తించారు. అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీచేశారు. దీనిపై స్పందించిన అతను గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం తనకు అందలేదంటూ సిట్ అధికారులకు వాట్సప్ ద్వారా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ డైరీలో రాసిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లు నిందితులు పోలీసుల దర్యాప్తు, సిట్ కస్టడీలోనూ ఒకేవిధంగా సమాధానమిచ్చారు.

డైరీలో లేని యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు...
అయితే శంకరలక్ష్మి  డైరీని స్వాధీనం చేసుకొని పరిశీలించిన సిట్ అధికారులు దానిలో ఎక్కడా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ రాసినట్లు ఆధారాల్లేవని నిర్ధారణకు వచ్చారు. సిట్ పోలీసులు, ఈడీ అధికారుల విచారణలోనూ శంకరలక్ష్మి ఇదే విషయాన్ని చెప్పారని సమాచారం. ముగ్గులు ఒకే విధమైన సమాధానం ఇవ్వడం, డైరీలో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో పెద్ద తలకాయల ప్రమేయం ఉండే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో మరికొందరు ఉన్నట్లు గుర్తించి అనుమానితుల జాబితాను సిట్ రూపొందించినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు గ్రూప్-1, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) పరీక్ష రాసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరికీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధాలున్నాయా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

కాగా జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి వాంగ్మూలం సేకరించారు. గ్రూప్-1లో 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసేందుకు గ్రూప్-1 పరీక్ష స్థాయి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. వీరిలో ఎవరికీ లీకేజీతో సంబంధాలు లేవనే అంచనాకు వచ్చారు. డీఏవో ప్రశ్నపత్రం కొనుగోలు కేసులో కొద్దిరోజుల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు సాయిలౌకిక్, సుశ్మితలను అరెస్ట్ చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల జాబితా రూపొందిస్తున్నారు. వీరిలో లీకేజీ నిందితులతో ఎవరెవరికి సంబంధాలున్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు.

సిట్ కస్టడీకి లౌకిక్, సుశ్మిత్..
డీఏవో ప్రశ్నపత్రం కొనుగోలు కేసులో అరెస్టయిన సాయిలౌకిక్, సుశ్మితలను శుక్రవారం సిట్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ కోరుతూ సిట్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి గురువారం అనుమతిచ్చింది.

Also Read:

ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ప్రిలిమినరీ 'కీ' విడుదల! అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణ స్టేట్‌ లెవల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్‌, ఐటీ అండ్‌ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్‌ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని పోలీసు నియామక మండలి ఏప్రిల్ 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ప్రకటలో తెలిపారు. ఫైనల్‌ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఆన్సర్ 'కీ' కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.  విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక  గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సీజీఎల్ఈ-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ సారి 7500 వరకు ఖాళీల భర్తీ - దరఖాస్తు ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2023' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 15 Apr 2023 10:32 AM (IST) Tags: TSPSC paper leak issue TSPSC Paper Leak TSPSC Group1 Paper Leak TSPSC Paper Leak Password issue

సంబంధిత కథనాలు

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

CCL: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?