HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) వివిధ విభాగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

HPCL Recruitment: ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 234 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సీబీటీ, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 234
పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 35 పోస్టులు, ఎస్టీ- 17 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 63 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 23 పోస్టులు, జనరల్- 96 పోస్టులు.
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 130
అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్‌లో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ 50% మార్కులతో 3 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీలకు 03 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.30,000-రూ.1,20,000.
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 65
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ 50% మార్కులతో 3 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీలకు 03 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.30,000-రూ.1,20,000.
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 37
అర్హత: ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ 50% మార్కులతో 3 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీలకు 03 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.30,000-రూ.1,20,000.
⏩ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్): 02
అర్హత: కెమికల్ ఇంజినీరింగ్‌లో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ 50% మార్కులతో 3 సంవత్సరాల ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీలకు 03 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.30,000-రూ.1,20,000.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ), గ్రూప్ టాస్క్/గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2025.
ALSO READ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే రూ.1.7 లక్షల వరకు జీతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు