అన్వేషించండి

NHAI: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే రూ.1.7 లక్షల వరకు జీతం

న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గేట్ స్కోరు -2024, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

NHAI Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్ స్కోరు- 2024, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.  

వివరాలు..

ఖాళీల సంఖ్య: 60

* డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులు

పోస్టుల కేటాయింపు: యూఆర్- 26 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 13 పోస్టులు, ఎస్సీ- 09  పోస్టులు, ఎస్టీ- 04 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 08 పోస్టులు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ (సివిల్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: గేట్ స్కోరు (2024), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం: నెలకు రూ.56,100 - రూ.1,77,500.

సర్వీస్ బాండ్: ఎంపికైన అభ్యర్థులందరూ ఉద్యోగంలో చేరే సమయంలో ఎన్‌హెచ్‌ఏఐలో చేరిన తేదీ నుంచి కనీసం 3 సంవత్సరాల పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)లో పనిచేయుటకు రూ.5.00 లక్షల మొత్తానికి సర్వీస్ బాండ్‌ అందించాల్సి ఉంటుంది. బాండ్ వ్యవధి ముగిసేలోపు అభ్యర్థులు జాబ్ రిజైన్ చేసిన సందర్భంలో లేదా ఎన్‌హెచ్‌ఏఐలో చేరిన మూడేళ్లలోపు వారి అనుచిత ప్రవర్తన కారణంగా వారి సేవను రద్దు చేసినట్లయితే, అటువంటి అభ్యర్థులు రూ.5.0 లక్షల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది

దరఖాస్తు చేయడం ఎలా..

➥ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి  Google Chrome లేదా Mozilla Firefox లో యాక్సెస్ చేయవచ్చు.

➥ ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ http://www.nhai.gov.in ఓపెన్ చేయాలి.

➥ అభ్యర్థులు → రిక్రూట్‌మెంట్ → వేకెన్సీస్ → కరెంట్ → ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. 

➥ డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) → ఆన్‌లైన్ అప్లికేషన్ యొక్క ప్రకటనపై క్లిక్ చేయాలి. 

➥ అప్లికేషన్ పూర్తి చేయడానికి స్క్రీన్ పై సూచనలను అనుసరించాలి.

అప్‌లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు..

➥ ఫోటోగ్రాఫ్ - కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ యొక్క స్కాన్ చేసిన కాపీ1 MB మించని ‘jpg / ‘jpeg’ లేదా ‘png’ లేదా ‘gif’ ఇమేజ్ ఫార్మాట్‌లో మాత్రమే.

➥ సిగ్నేచర్ – 1 MB మించకుండా ‘jpg / ‘jpeg’ లేదా ‘png’ లేదా ‘gif’ ఇమేజ్ ఫార్మాట్‌లో మాత్రమే సిగ్నేచర్ యొక్క స్కాన్ చేసిన కాపీ.

➥ 2 MB మించకుండా 'pdf' ఇమేజ్ ఫార్మాట్‌లో మాత్రమే పుట్టిన తేదీని ధృవీకరించే  X  క్లాస్ సర్టిఫికేట్.

➥ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(ఎన్‌సీఎల్)/ఈడబ్ల్యూఎస్/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కాస్ట్/కేటగిరీ సర్టిఫికెట్(2 MB మించకుండా 'pdf' ఇమేజ్ ఫార్మాట్‌లో మాత్రమే).

➥ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సర్టిఫికెట్(2 MB మించకుండా 'pdf' ఇమేజ్ ఫార్మాట్‌లో మాత్రమే).

➥ గేట్ స్కోర్ కార్డ్ 2 0 2 4(2 MB మించకుండా 'pdf' ఇమేజ్ ఫార్మాట్‌లో మాత్రమే).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.02.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget