News
News
వీడియోలు ఆటలు
X

ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల!

తెలంగాణలో డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మే 2న విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మే 2న విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న చోట కనీసం రెండేళ్ల సర్వీస్‌ పూర్తయినవారు మాత్రమే బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్‌ కళాశాలల్లోని ఖాళీలను మాత్రమే బదిలీల ద్వారా భర్తీ చేస్తారు. ఒకవేళ బదిలీ కోసం పెట్టుకున్న దరఖాస్తులు 17 కాలేజీల్లోని ఖాళీల కంటే ఎక్కువ ఉంటే నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఖాళీల్లో భర్తీ చేస్తారు.

ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ‌ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆదేశాల మేర‌కు డీఎంఈ ప‌రిధిలోని ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల బ‌దిలీల‌కు వైద్యారోగ్య శాఖ ఈ మార్గదర్శకాలు విడుద‌ల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఆరోగ్య తెలంగాణ సాకారం చేసేందుకు కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు ఈ సందర్బంగా ఆకాంక్షించారు. ప్రస్తుతం ప‌నిచేస్తున్న చోట క‌నీసం రెండేళ్ల స‌ర్వీస్ పూర్తయిన వారు మాత్రమే ద‌ర‌ఖాస్తుకు అర్హులని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడిక‌ల్ కాలేజీల్లోని ఖాళీల‌ను మాత్రమే బ‌దిలీల ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. ఒక‌వేళ బ‌దిలీ కోసం పెట్టుకున్న ద‌ర‌ఖాస్తులు 17 కాలేజీల్లోని ఖాళీల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే.. న‌ల్గొండ‌, సూర్యాపేట‌, సిద్దిపేట‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, ఆదిలాబాద్ రిమ్స్ లో ఖాళీల్లో భ‌ర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ సంద‌ర్భంగా ఉస్మానియా, గాంధీ, కాక‌తీయ (వ‌రంగ‌ల్‌), నిజామాబాద్ మెడిక‌ల్ కాలేజీల్లోని ఖాళీల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్రద‌ర్శించ‌రు. ఒక పోస్ట్ కు ఒక‌రిక‌న్నా ఎక్కువ మంది ద‌ర‌ఖాస్తు చేస్తే స్పౌజ్, అంగ‌వైక‌ల్యం, బుద్ధిమాంద్యం పిల్లలు, కారుణ్య నియామకాలు, కుటుంబ స‌భ్యుల్లో తీవ్ర అనారోగ్య స‌మ‌స్యలు వంటి అంశాల ఆధారంగా ప్రాధాన్యం నిర్ణయిస్తారని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.

కౌన్సిలింగ్‌ సందర్భంగా ఉస్మానియా, గాంధీ, కాకతీయ, నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలల్లోని ఖాళీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించరు. ఒక పోస్ట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే స్పౌజ్‌, అంగవైకల్యం, బుద్ధిమాంద్యులైన పిల్లలు, కారుణ్య నియామకాలు, కటుంబ సభ్యుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు వంటి అంశాల ఆధారంగా ప్రాధాన్యం నిర్ణయిస్తారని వైద్య,ఆరోగ్య శాఖ బదిలీలకు విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

Aslo Read:

టీఎస్‌పీఎస్సీకి మే 'పరీక్షా'కాలం, పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణ! మే నెలలో 7 పరీక్షలు!
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు నియామక పరీక్షలన్నీ వాయిదాపడ్డాయి. అప్పటికే నిర్వహించిన పరీక్షలతోపాటు, భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలను కూడా కమిషన్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మే నెలలో వివిధ నియామక పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తులు ప్రారంభించింది. మే 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలో 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా 7 పరీక్షలు నిర్వహించనుంది. వీటిలో అత్యధికంగా 1,540 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనుంది. 
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 02 May 2023 11:28 PM (IST) Tags: guidelines Assistant Professors Health Department Telangana News Education News in Telugu Associate Professors Professors

సంబంధిత కథనాలు

WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!

WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!

TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్‌ పోస్టులు

TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్‌ పోస్టులు

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం