GGH Kurnool Jobs: కర్నూలు-జీజీహెచ్‌లో 94 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య సంస్థల్లో పారామెడికల్ పోస్టుల (Paramedical Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
GGH Kurnool Notification: కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య సంస్థల్లో పారామెడికల్ పోస్టుల (Paramedical Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 9 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 94
వైద్య సంస్థలు: కర్నూలు మెడికల్ కాలేజ్ (కర్నూలు), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (కర్నూలు), రీజనల్ ఐ హాస్పిటల్ (కర్నూలు), గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (కర్నూలు), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (నంద్యాల), ప్రభుత్వ వైద్య కళాశాల (ఆదోని), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆదోని).
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ జూనియర్ అసిస్టెంట్: 50
➥ పర్సనల్ అసిస్టెంట్: 01
➥ లైబ్రరీ అటెండెంట్: 01
➥ వార్డెన్(ఫిమేల్): 02
➥ క్లాస్ రూం అటెండెంట్: 01
➥ డార్క్ రూమ్ అసిస్టెంట్: 01
➥ మౌల్డ్ టెక్(సీనియర్): 01
➥ OT అసిస్టెంట్: 01
➥ ENMG: 01
➥ EEG: 01
➥ ఆర్థో టెక్నీషియన్: 02
➥ ఆర్థోటిస్ట్: 01
➥ ప్రోస్తేటిక్ టెక్నీషియన్: 01
➥ ప్రోస్టెటిస్ట్: 01
➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
➥ రిసెప్షనిస్ట్ కమ్-క్లర్క్: 01
➥ డ్రైవర్: 01
➥ పెయింటర్: 01
➥ వైర్‌మెన్: 01
➥ కార్పెంటర్: 01
➥ స్ట్రెచర్ బేరర్: 01
➥ హౌస్ కీపర్/హౌస్ కీపర్Gr-II: 02
➥ బార్బర్: 02
➥ హెల్పర్: 03
➥ లస్కర్: 02
➥ లిఫ్ట్ అటెండెంట్: 02
➥ పంప్‌మన్: 02
➥ షూ మేకర్: 01
➥ వాన్ అటెండెంట్: 01
➥ యానిమల్ అటెండెంట్: 01
➥ గార్డెనర్: 02
➥ ధోబీ: 01
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం 03 సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడిగింపుతో పాటు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.250, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులకు రూ.200. అభ్యర్థులు 'Principal, Kurnool Medical College, Kurnool' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Office of Principal, Kurnool Medical College, Kurnool.
దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..
➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదితరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్ కాపీ.
➥ పోస్టుకి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్ కాపీలు సమర్పించాలి.
➥ క్వాలిఫైయింగ్ లేదా తత్సమాన ఎగ్జామినేషన్‌కు సంబంధించిన అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు. మార్కుల మెమోలు లేనట్లయితే, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మార్కులు లెక్కించబడతాయి.
➥ ఏపీ పారా మెడికల్ బోర్డ్/అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్/ఏదైనా ఇతర కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు/ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాపీ.
➥ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.
➥ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్(2023-24 సంవత్సరానికి సంబంధించిన) సర్టిఫికేట్.
➥ దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).
➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు.
ముఖ్యమైన తేదీలు..
⫸నోటిఫికేషన్ తేది: 31.12.2023
⫸ దరఖాస్తు ప్రారంభ తేది: 02.01.2024.
⫸ దరఖాస్తుకు చివరి తేది: 09.01.2024.
⫸ దరఖాస్తుల పరిశీలన తేదీలు: 10.01.2024 to 31.01.2024.
⫸ తాత్కాలిక మెరిట్ జాబితా లిస్ట్: 01.02.2024.
⫸ ఫిర్యాదుల స్వీకరణ /తాత్కాలిక మెరిట్ జాబితాపై అభ్యంతరాలు: 02.02.2024 to 05.02.2024.
⫸ ఫిర్యాదులు / అభ్యంతరాల పరిష్కారం: 06.02.2024 to 13.02.2024.
⫸ తుది మెరిట్ జాబితా ప్రదర్శన మరియు ఎంపిక జాబితా: 14.02.2024.