ఎథికల్ హ్యాకర్ అంటే సైబర్ సెక్యూరిటీ నిపుణుడు. వీరు దేశానికి, పెద్ద కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ అందిస్తారు. సైబర్ రంగంలో అన్యాయాలను, అక్రమాలను అరికట్టడంలో వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు.
గ్రామీణ యువత సైబర్ సెక్యూరిటీలో రాణించవచ్చు! Ethical Hacker అవ్వడానికి 4 కీలక దశలు, అవకాశాలు తెలుసుకోండి
Ethical Hacker: ఆసక్తి ఉంటే గ్రామీణ యువత కూడా ఎథికల్ హ్యాకర్ కావచ్చు. లక్షల జీతాలు పొందే ఉద్యోగంలో స్థిరపడవచ్చు. ఇది జరగాలంటే ఈ కథనంలో ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవండి.

Ethical Hacker: భారతదేశ యువత ప్రతిభ గ్రామాల్లో మెండుగా ఉంటుంది. గ్రామీణ యువతకు దిశానిర్దేశం చేస్తే వారు అద్భుతాలు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం సైబర్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. కాని వాటిని అందుకునే ప్రతిభావంతులు దొరకడం ప్రధాన సమస్య. సైబర్ రంగంలో ఎథికల్ హ్యాకర్ల కొరత తీవ్రంగా ఉంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులనే ఎథికల్ హ్యాకర్ (Ethical Hacker) అంటారు. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ఎథికల్ హ్యాకర్ల కొరత ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణుల నివేదిక చెబుతోంది. అయితే మన గ్రామీణ యువత కూడా ఈ అవకాశాలను పొందవచ్చు. దీనిపై కొంత దృష్టి పెడితే గ్రామీణ యువత ఎథికల్ హ్యాకర్ (Ethical Hacker) అవడం పెద్ద కష్టం కాదు. అలా దృష్టి పెట్టాల్సిన నాలుగు దశలు కీలకం. అవి ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఎథికల్ హ్యాకర్ అంటే ?
ఎథికల్ హ్యాకర్ (Ethical Hacker) అంటే సినిమాల్లో చూపించినట్లు అది హీరోల పని కాదు. ఎథికల్ హ్యాకర్ అంటే నాలుగు గోడల మధ్య చీకటిలో నాలుగు బిగ్ కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని చేసే పని అంతకన్నా కాదు. ఎథికల్ హ్యాకర్ (Ethical Hacker) అనే జాబ్ దేశానికి, పెద్ద పెద్ద కంపెనీలకు సైబర్ సెక్యూరిటీనిచ్చే గౌరవప్రదమైన ఉద్యోగం. సమాజంలో అన్యాయాలను, అక్రమాలను అరికట్టడానికి పోలీస్ ఎలాగో, సైబర్ రంగంలో ఎథికల్ హ్యాకర్ కూడా ఓ పోలీస్ లాంటివాడే. ఇంటర్నెట్ ఉంటే చాలు ఎథికల్ హ్యాకర్ కావచ్చు. అందుకు ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొదటి దశలో నేర్చుకోవాల్సినవి ఇవే.....
కంప్యూటర్ పై ప్రాథమిక పరిజ్ఞానం - సైబర్ సెక్యూరిటీ నిపుణులు కావాలంటే ముందుగా గ్రామీణ యువత దృష్టి పెట్టాల్సింది కేవలం డిగ్రీ సర్టిఫికెట్ మీద మాత్రమే కాదు. ఎథికల్ హ్యాకింగ్ ను ఓ వృత్తిగా ఎంచుకుంటే కంప్యూటర్ మీద పరిజ్ఞానాన్ని కొంచెం కొంచెంగా పెంచుకోవాలి. కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, దానిలోని భాగాలు (Hardware), సాఫ్ట్‌వేర్ అంటే ఏమిటి అనేది నేర్చుకోవాల్సి ఉంది.
ఇంటర్నెట్/నెట్‌వర్క్ బేసిక్స్ - కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంటర్నెట్ పని తీరు మీద కనీస అవగాహన అవసరం. మన ఫోన్ లేదా ఇంట్లో మనం వాడే ఇంటర్నెట్ ఎలా వస్తుంది? వై-ఫై (Wi-Fi), రూటర్ (Router) అంటే ఏమిటి? డేటాను ఎలా ఒక చోట నుంచి మరో చోటికి చేరుస్తారు? వంటి నెట్‌వర్కింగ్ (Networking) బేసిక్స్ అంశాలను నేర్చుకోవాలి.
ఆపరేటింగ్ సిస్టమ్ (OS)పై అవగాహన- మనం వాడే ఫోన్ లేదా కంప్యూటర్ వంటివి కేవలం డివైస్‌లు మాత్రమే. అవి పని చేయాలంటే సాఫ్ట్ వేర్ అవసరం. ఇందుకోసం మీరు వాడే విండోస్ మాత్రమే కాకుండా హ్యాకింగ్‌కు ముఖ్యమైన Linux (ముఖ్యంగా Kali Linux) గురించి నేర్చుకోవాలి. మీరు ఇంటర్నెట్ సెంటర్‌లో లేదా మీ ఫోన్‌లో కూడా దీని గురించి చదవచ్చు. దీనిపై చేసిన యూట్యూబ్ వీడియోస్ ను చూసి ప్రాథమిక పరిజ్ఞానం పెంచుకోవచ్చు. తెలుగులో కూడా ఈ ట్యుటోరియల్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి.
రెండో దశలో నేర్చుకోవాల్సినవి ఇవే..
కోడింగ్ నేర్చుకోవడం (The Super Power Tool)- ఎథికల్ హ్యాకర్ కావాలంటే కోడింగ్ నేర్చుకోవాలి. కోడింగ్ అంటే మనం కంప్యూటర్‌కు ఆర్డర్ ను ఇవ్వడం. దానినే కోడింగ్ (Coding) అంటారు.
పైథాన్ (Python) - ఇది సైబర్ సెక్యూరిటీలో అత్యంత ముఖ్యమైన భాష. ఈ భాష సులభంగా అర్థమవుతుంది. ఎథికల్ హ్యాకర్లు తరచుగా వారి పనిని వేగవంతం చేయడానికి, ఆటోమేట్ (Automate) చేయడానికి సొంత సాధనాలు (tools) లేదా చిన్న స్క్రిప్ట్‌లు (scripts) రాయాల్సి వస్తుంది. ఇందుకు పైథాన్ అవసరం.
ఉచిత ఆన్‌లైన్ కోర్సులు - Coursera, Udemy, edX వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉచితంగా లేదా తక్కువ ధరకే Python బేసిక్స్ కోర్సులు దొరుకుతాయి. వీటి ద్వారా పైథాన్ లాంగ్వేజ్ ను నేర్చుకోవచ్చు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ - నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ వంటి సంస్థలు సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నాయి. CSC (Common Service Center - మీ గ్రామాల్లో ఉండే సేవా కేంద్రాలు) లను సంప్రదించి, కేంద్ర ప్రభుత్వ ఉచిత శిక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు.
మూడో దశలో సైబర్ సెక్యూరిటిపై లోతైన అధ్యయనం (The Specialization)
బేసిక్స్, కోడింగ్ వచ్చాక, అసలైన ఎథికల్ హ్యాకింగ్ విషయాలపై దృష్టి పెట్టాలి. హ్యాకర్లు మోసం చేసే విధానాలు తెలుసుకోవాలి. గతంలో జరిగిన సైబర్ దాడుల (Cyber Attacks) కోసం పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇవి శిక్షణ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు వివరంగా చెబుతారు. అయితే మూడో దశలో ఫోకస్ చేయాల్సిన అంశాలు:
Vulnerability Assessment (లోపాలను కనుగొనడం) - కంప్యూటర్ సిస్టమ్స్‌లో, వెబ్‌సైట్లలో, ఆయా యాప్‌లలో ఉండే బలహీనతలను గుర్తించడం ఎలా అన్న అంశాలపై ఫోకస్ చేయాలి.
Penetration Testing (పెనెట్రేషన్ టెస్టింగ్) - ఎథికల్ హ్యాకర్ కూడా ఒక హ్యాకర్ లాగా ఆయా కంపెనీల సిస్టమ్‌లోకి చొరబడటానికి ప్రయత్నించి, లోపాలను కనుక్కోవడం. తద్వారా హ్యాకర్లు ఎలా సైబర్ దాడులు చేస్తారు, వారికి ఉండే మార్గాలు ఏంటి, వాటిని ఎలా సరి చేయాలన్న అంశాలు దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
క్రిప్టోగ్రఫీ (Cryptography) - డేటాను ఎన్‌క్రిప్ట్ (Encrypt) చేయడం, అంటే రహస్య సంకేతాలుగా మార్చడం ఎలాగో తెలుసుకోవడం. అంటే సున్నితమైన సమాచారం ఇతరులకు అర్థం కాకుండా ఒక కోడ్ రూపంలో మార్చి సరైన వ్యక్తికి పంపడం నేర్చుకోవాలి. తిరిగి ఆ వ్యక్తి మాత్రమే దాన్ని సమాచార రూపంలో మార్చేలా కోడ్ తయారు చేయడం వంటివి ఇందులో ఉంటాయి.
నాలుగో దశలో అవసరమైనవి ఇవే
సర్టిఫికేషన్లు & ప్రాక్టీస్ (Proof and Practice) - మీరు ఎథికల్ హ్యాకింగ్ పై పూర్తి పట్టు సాధించినా ఉద్యోగ అవకాశాలు రావాలంటే మీ నైపుణ్యంపై సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఇది ఉద్యోగ సమయంలో ఇంటర్వ్యూలో కీలకం. అలాంటి సరైన సర్టిఫికెట్ సైబర్ సెక్యూరిటీ సంస్థల నుంచి పొంది ఉండాల్సిన అవసరం ఉంది.
Certified Ethical Hacker (CEH) - సీ ఈ హెచ్ సర్టిఫికెట్ అనేది సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్. దీన్ని ఆన్‌లైన్ కోర్సులు చదివి పొందవచ్చు. ఇది ఉద్యోగం పొందడానికి ఉపయోగపడుతుంది.
ప్రాక్టికల్ అనుభవం - హ్యాకింగ్ అనేది థియరీతో నడిచేది కాదు. ప్రాక్టికల్ అనుభవం తప్పనిసరి. ల్యాబ్ వాతావరణంలో అంటే మీకు అనుమతి ఉన్న సిస్టమ్ పై ప్రయోగాలు చేస్తూ ఉండాలి. హ్యాకింగ్ చేసే విధానంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ నైపుణ్యం పెంచుకుంటూ ఉండాలి. ఇక Hack The Box / TryHackMe అనే సురక్షితమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీరు చట్టబద్ధంగా హ్యాకింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయవచ్చు.
గ్రామీణ యువత ఎథికల్ హ్యాకర్ కావాలంటే కావాల్సిన మరిన్ని చిట్కాలు ఇవే
కమ్యూనికేషన్ సెంటర్ - మీ ఊరిలో కమ్యూనికేషన్ సెంటర్ (CSC) ద్వారా మీ కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకునేందుకు వాటి సేవలను వాడుకోండి. ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి (Skill Development) కార్యక్రమాలు, ఉచిత ఆన్‌లైన్ శిక్షణల గురించి అడిగి తెలుసుకోండి. ఈ సౌకర్యాన్ని వాడుకునేందుకు వారు ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఇస్తారు.
పాత కంప్యూటర్లను వాడండి - ఎక్కువ ధరకు మీరు కంప్యూటర్ కొనలేకపోతే, మీ చుట్టుపక్కల ఉండే పాత కంప్యూటర్లను సేకరించి లేదా తక్కువ ధరకి కొని, వాటిపై Linux ఆపరేటింగ్ సిస్టమ్‌ను వేసి ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ మీకు రానున్న రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది.
ఇంగ్లీషు పై పట్టు - సైబర్ రంగంలో చాలా టెక్నికల్ పదాలు ఇంగ్లీషులో ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే రోజు ఇంగ్లీషు భాషపై పట్టు సాధించేందుకు సిద్ధమవండి. ఇంగ్లీషు పేపర్ చదవడం, ఇంగ్లీషు న్యూస్ వినడం, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఇంగ్లీషు స్నేహితులతో సంభాషించడం చేయండి. దీని ద్వారా మీ ఇంగ్లీషు స్కిల్స్ పెరుగుతాయి.
ఎథికల్ హ్యాకింగ్ రావాలంటే భాష లేదా టెక్నాలజీ నేటి గ్రామీణ యువతకు ఏ మాత్రం అడ్డంకి కాదు. మీ ఆసక్తే మిమ్మల్ని ఈ రంగంలో నంబర్ వన్‌గా నిలబెడుతుంది. ఎథికల్ హ్యాకర్ కావాలంటే ఇప్పటి నుంచే మీరు దీనిపై శ్రద్ధ పెట్టండి. ఈ రంగంలో ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన కెరీర్‌కు ఈ గ్రామం, మీ ప్రాంతం ఏ మాత్రం అడ్డుగోడ కాదు. ఇక ఇప్పుడే ఎథికల్ హ్యాకింగ్ పై దృష్టి పెట్టేయండి. ఆల్ ది బెస్ట్.
Frequently Asked Questions
ఎథికల్ హ్యాకర్ అంటే ఏమిటి?
ఎథికల్ హ్యాకర్ కావడానికి మొదటి దశలో ఏం నేర్చుకోవాలి?
మొదటి దశలో కంప్యూటర్ పై ప్రాథమిక పరిజ్ఞానం, ఇంటర్నెట్/నెట్‌వర్క్ బేసిక్స్, మరియు ఆపరేటింగ్ సిస్టమ్ (ముఖ్యంగా Linux) పై అవగాహన పెంచుకోవాలి.
ఎథికల్ హ్యాకర్ కావడానికి కోడింగ్ ఎందుకు అవసరం?
ఎథికల్ హ్యాకర్ కావడానికి కోడింగ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా పైథాన్ (Python) వంటి భాషలు సైబర్ సెక్యూరిటీలో తరచుగా ఉపయోగపడతాయి. వీటితో సొంత సాధనాలు, స్క్రిప్ట్‌లు రాయవచ్చు.
మూడవ దశలో సైబర్ సెక్యూరిటిపై లోతైన అధ్యయనంలో ఏ అంశాలు ఉంటాయి?
మూడవ దశలో Vulnerability Assessment (లోపాలను కనుగొనడం), Penetration Testing (నిజమైన హ్యాకర్ లాగా సిస్టమ్‌లోకి చొరబడి లోపాలను కనుక్కోవడం), మరియు Cryptography (డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడం) వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
ఎథికల్ హ్యాకింగ్‌లో సర్టిఫికేషన్లు ఎంత ముఖ్యం?
ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యం సాధించిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం సర్టిఫికేట్ తప్పనిసరి. Certified Ethical Hacker (CEH) వంటి సర్టిఫికేషన్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.























